PM Modi : నిన్నటి నుంచి తెలుగువాళ్లు అందరూ మోడీ అమరావతి ప్రారంభోత్సవం మీదనే మాట్లాడుతున్నారు. కానీ మోడీ అమరావతి కి ముందు తిరువనంతపురం నుంచి వచ్చింది. అక్కడ తిరువనంతపురం దగ్గర్లోని విజ్జజ్జం పోర్ట్ ను మోడీ ప్రారంభించాడు. ఏమిటిదీ.. చరిత్రలో మైలు రాయి.. గేమ్ చేంజర్ అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు.
ఎందుకంటే దేశంలో మొట్టమొదటి కంటైనర్ ఎగుమతుల డీప్ పోర్ట్.. కంటైనెర్ ట్రాన్స్ షిప్ మెంట్ 20 మీటర్ల లోతు గల డీప్ పోర్ట్ ఇదీ. దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మీరు రాష్ట్రానికో.. దేశానికో కూరగాయలు పంపిస్తారు. ఓడలోని సరుకులు ఇంకో ఓడలోకి మార్చి వేరే ప్రాంతాలకు పంపిస్తారు.
ప్రపంచంలో మొత్తం వ్యాపారంలో 90 శాతం సముద్ర మార్గం ద్వారానే జరుగుతుంది. విలువ రీత్యా 70 శాతం సముద్రమార్గం ద్వారానే జరుగుతాయి. మామూలు షిఫ్ట్ లు కావు ఇవీ.. లోతైన పోర్ట్ లు కావాలి. 20 మీటర్ల లోతు ఉన్న పోర్టు ‘విజ్జజ్జం’ వద్ద ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్స్ ఉంటాయి. వీటి దగ్గర పెద్ద షిప్పులు వెళుతుంటాయి. దారిలో వచ్చే పోర్టుల దగ్గర ఇవి ఆగుతాయి. ప్రతీ దేశం వద్ద ఇవి ఆగవు. ఆగే పోర్టు నుంచి తమ దేశానికి, ప్రాంతానికి సరుకులను తీసుకెళతారు. ఇది ఇక్కడ జరిగేది.
మొట్టమొదటి భారత్ ట్రాన్స్ షిప్ మెంట్ పోర్టుని ప్రారంభించిన మోడీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.