Congress: పహల్ గాం సంఘటన మరిచిపోలేని ఓ చేదు జ్ఞాపకంగా మిగిలింది. దేశమంతా ఒక్కటై కదిలింది. పాకిస్తాన్ అనుకున్నది వేరు. జరిగింది వేరు. ఇలా మత ప్రాతిపదికన చంపేస్తే తన్నుకుంటారు అనుకున్నారు. కానీ అన్నీ మతాల వారు కలిసి ద్వేషిస్తున్నారు. వ్యతిరేకిస్తున్నారు. పాకిస్తాన్ న నాశనం చేయాలన్న కోపంగా ఉన్నారు.
ముస్లిం పార్టీ అయిన అసదుద్దీన్ ఓవైసీ తీరు అభినందనీయం. ఇండియా టుడేలో రాజ్ దీప్ ఎంత ప్రోవోక్ కాకుండా కేవలం పాకిస్తాన్ మీద దుమ్మెత్తిపోశాడు. ఆ దేశాన్ని తిట్టిపోశాడు. కశ్మీర్ లో నిరసనలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కశ్మీర్ అసెంబ్లీలో సీఎం ఒమర్ అబ్దుల్లా చాలా బాగా మాట్లాడాడు. టూరిస్టలను రమ్మని వారి ప్రాణాలు కాపాడలేకపోయాను. రాష్ట్ర ప్రతిపత్తి కూడా వద్దన్నారు. పాకిస్తాన్ ను శిక్షించాలని దేశంలోని ముస్లింలు కూడా కోరుతుండడం విశేషం.
ప్రజలు తెలివైన వారు. దేశం ముందు తర్వాత ఏదైనా.. కానీ కాంగ్రెస్ పార్టీకి ఏమైందో కానీ రాబర్ట్ వాద్రా మాట్లాడింది చూస్తే రక్తం మరుగుతోంది. రాహుల్ గాంధీ మోడీకి మద్దతు ఇవ్వడం ఆహ్వానించదగ్గ విషయం.
కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య, జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ నేత మాట్లాడింది చూస్తే రక్తం మరుగుతోంది.
కాంగ్రెస్ స్వీయ వినాశనం కోరుకుంటే ఎవరేం చేస్తారు? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
