Madurai Murugan Manadu : రేపు 22వ తేదీ మధురైలో ‘మురుగన్’ భక్తుల మహానాడు’ జరుగబోతోంది. ఈసారి ఎన్ని రాజకీయ అడ్డంకులు సృష్టించిందంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వం జరగనీయకుండా అడ్డంకులు సృష్టించింది. చివరకు బెంగళూరు తొక్కిసలాటను బూచీగా చూపి అనుమతిని తమిళ ప్రభుత్వం రద్దు చేసింది.
అయితే హైకోర్టుకు ఎక్కి మరీ మురుగన్ భక్తులు కండీషన్లతో అనుమతి తెచ్చుకొని సభను నిర్వహిస్తుతున్నారు. ప్రభుత్వం ఒక భక్తుల సమావేశం జరిగితే.. దాన్ని జరగకుండా చేయని కుట్ర లేదు. మంత్రులే రంగంలోకి దిగి అడ్డుకుంటున్నారు.
నిన్న మధురైలో ఒక మానవహారాన్ని చేశారు. వామపక్షాలు, ద్రవిడ పార్టీలు, దేవుడిని నమ్మనివారు.. ఇస్లామిక్ వాదులు ఈ సమావేశం జరుగకుండా చేయడానికి.. వ్యతిరేకంగా మానవహారాన్ని నిర్వహించారు. ఇది రాజకీయ ప్రేరేపిత సమావేశం అంటూ నిరసన తెలిపారు.
ప్రభుత్వ నిర్బంధాలను తట్టుకుని మదురై మురుగన్ భక్తుల మహానాడు జరుగుతుందా? అక్కడి పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.