Karnataka Elections 2023 : కర్ణాటక ఎన్నికల రాజకీయ ముఖచిత్రం మారుతోంది. నిన్నటితో నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ ముగిసింది. ఎవరు పోటీలో ఉన్నారన్నది తేలిపోతోంది.
గతంలో ఇచ్చిన ఒపీనియన్ సర్వేలన్నీ అభ్యర్థులు లేకుండా చేసిన సర్వేలు. అభ్యర్థులు తేల్చిన తర్వాత ఇప్పుడు చేసిన సర్వేలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఇప్పటికీ ఓ క్లారిటీ వచ్చింది.
అభ్యర్థుల ప్రకటన ముందు కర్ణాటక బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని తేలింది. ఓవరాల్ గా బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతనా? లేదా ఎమ్మెల్యేలపై వ్యతిరేకతనా? అన్నది తేల్చలేదు. అయితే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే కనుక బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గుతుంది. అందుకే బీజేపీ తన అభ్యర్థుల లిస్ట్ లో సమూల మార్పులు చేసింది.
కర్ణాటకలో మూడోవంతు కొత్త ముఖాల బీజేపీ లిస్టు ‘ప్రభుత్వ వ్యతిరేకతను’ తగ్గిస్తుందా? లేదా? అన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.