Tamannaah : జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఎప్పుడో 2005 లో టాలీవుడ్ లోకి మంచు మనోజ్ శ్రీ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు. ఇన్ని సంవత్సరాలపాటు కెరియర్ సాగిస్తోందంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం తమన్నా చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కథానాయక పాత్ర పోషిస్తున్నది. ఇన్ని సంవత్సరాల పాటు సినిమాలు చేసినప్పటికీ తమన్నా మీద ఇప్పటివరకు ఒక్క రూమర్ కూడా రాలేదు .
అయితే తాజాగా తమన్నా విజయ్ వర్మ అనే నటుడితో రిలేషన్ లో ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విజయ్ వర్మ ఎవరో కాదు.. గతంలో నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ గా కనిపించాడు. గతంలో విజయ్ వర్మతో తమన్నా క్లోజ్ గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. పలు పార్టీల్లోనూ వీరు ఇద్దరు కలిసి కనిపించారు.
తాజాగా వీరిద్దరూ కలిసి ముంబైలోని హోటల్లో డిన్నర్ చేసి బయటకు వస్తుండగా అక్కడి విలేకరులకు కనిపించారు. తమన్నా చేయి ఊపుతూ విజయ్ వర్మ కారులో కలిసి వెళ్లిపోయారు.. గత కొంతకాలంగా రూమర్ గా ఉన్న వీరి అనుబంధం ఈ వీడియోతో నిజమని తేలిపోయింది.
దీనిపై ఒక ఆంగ్ల పత్రికకు తమన్నా ఇంటర్వ్యూ వచ్చింది. తనపై ఇలాంటి పుకార్లు ఎందుకు సృష్టిస్తారని తమన్నా ప్రశ్నించింది. విజయ్ వర్మతో ప్రస్తుతం ఒక సినిమా చేయబోతున్నానని తెలిపింది. సినిమా తారలకు ప్రతి శుక్రవారం పెళ్లవుతుందని, ఇందులో కొత్త ఏమీ లేదని తమన్నా అభిప్రాయపడింది. సహన
టుడితో డిన్నర్ చేస్తే తప్పేంటిని ప్రశ్నించింది.. ఇక ప్రస్తుతం తమన్నా చిరంజీవి భోళా శంకర్, రజనీకాంత్ జైలర్, అరణ్మయై _4, బోలే చుడియన్ అనే సినిమాల్లో నటిస్తోంది.