Jharkhand Hemant Soren: బీహార్ ఎన్నికల ఫలితం మిగతా రాష్ట్రాల మీద.. మిగతా పార్టీల మీద ఎలా పడుతుందనే దానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఓ ఉదాహరణగా నిలుస్తున్నాయి.
దశాబ్దం కిందటి వరకూ బీహార్ లో అంతర్భాగంగా ఉన్న జార్ఖండ్ లోనూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పరిణామాలు మారుతున్నాయి. జార్ఖండ్ లో జేఎంఎం అధికారంలో ఉంది. ఇది ఇండీ కూటమి. 2024 జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం గెలిచింది. బీజేపీ ఓడిపోయింది. ఇండీ కూటమి అధికారంలోకి వచ్చింది. జార్ఖండ్ లో జేఎంఎం , కాంగ్రెస్ కలిసి పోటీచేసి గెలిచాయి. బీహార్ లోనూ ఆర్జేడీ-జేఎంఎంతో పోటీ చేసి ఓడిపోయాయి. ఇప్పుడు ఆ భయం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని జార్ఖండ్ లో ఉన్న జేఎంఎంకు పట్టుకుంది.
బీహార్ లో మహాగట్ బంధన్ లో జేఎంఎం చేరింది. అయితే ఒక్క సీటు కూడా బీహార్ లో జేఎంఎంకు కాంగ్రెస్ ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూటమితో జార్ఖండ్ లోనూ తెగదెంపులు చేసుకునే పనిలో పడ్డారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ తో కటీఫ్ చేసుకొని బీజేపీ ఎన్డీఏ కూటమిలో చేరేందుకు జేఎంఎం ప్రయత్నాలు ప్రారంభించింది. జేఎంఎం అధినేత సోరెన్ పై ఈడీ , సీబీఐకేసులుండడం కూడా బీజేపీ వైపు మొగ్గు చూపడానికి కారణంగా కనిపిస్తోంది.
ఇండీ కూటమి వీడనున్న జార్ఖండ్ హేమంత్ సోరెన్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
