Deputy CM Pawan Kalyan: రాజకీయ అవసరాలు కొన్ని పదవులను సృష్టిస్తాయి. కొందరిని సంతృప్తి పరిచేందుకు కొన్ని పదవులను సృష్టించి ఇస్తారు. అది రాజ్యాంగబద్ధమైన పదవులు కాదు. కేవలం హోదా కోసం సృష్టించినవి. దేశానికి ఉప ప్రధానులు, రాష్ట్రాలకు ఉపముఖ్యమంత్రులు ఈకోవలోకే చెందుతాయి. అయితే ఇలా ఉప్ప పదవులు దక్కించుకున్న వారు.. తరువాత ప్రధానమైన పదవులను అలంకరించిన దాఖలాలు లేవు. దేశానికి తొలి ఉప ప్రధానిగా వల్లభాయ్ పటేల్( Vallabhbhai Patel ) వ్యవహరించగా.. చివరి ఉప ప్రధానిగా లాల్ కృష్ణ అద్వానీ ఉండేవారు. అయితే ఇలా ఉప ప్రధానులుగా వ్యవహరించిన వారు తర్వాత క్రమంలో ప్రధానులు కాలేకపోయారు. ఉపముఖ్యమంత్రుల పరిస్థితి అదే. తెలుగు రాష్ట్రాల్లో 15 మంది వరకు ఉప ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. అందులో ఒక్క నీలం సంజీవరెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి కాగలిగారు.
చాలా ఏళ్లుగా..
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉపముఖ్యమంత్రులు రంగంలోకి వచ్చారు. 2004లో రాజశేఖర్ రెడ్డి ( y s Rajasekhar Reddy ) నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన కృషిని గుర్తించిన కాంగ్రెస్ హై కమాండ్ ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. అది మొదలు ఉపముఖ్యమంత్రి అనే పదవి ప్రస్థానం ప్రారంభం అయింది. కాంగ్రెస్ హయాంలో తెలంగాణతో పాటు ఏపీకి ప్రాధాన్యమిస్తూ ఉపముఖ్యమంత్రి పదవులను కేటాయించారు.. అప్పట్లో తెలంగాణ నుంచి దామోదర రాజనర్సింహ, ఏపీ నుంచి కోనేరు రంగారావు ఇలా ఉప ముఖ్యమంత్రి అయిన వారే. అయితే కేవలం సామాజిక సమీకరణలో భాగంగా వారికి పదవులు కేటాయించి.. రాజకీయంగా ప్రకటనలు చేసేవారు. ఆ పదవి నుంచి వారికి దొరికింది ఏమీ లేదు. రాజకీయంగా వనగూరే ప్రయోజనాలు కూడా లేవు.
Also Read: ఏపీలో కాపులు దళితులు కలవాలంటే?
ఉపముఖ్యమంత్రుల పరంపర..
2014లో తొలిసారిగా నవ్యాంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు( CM Chandrababu). విభజిత తెలంగాణకు సీఎం అయ్యారు కెసిఆర్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు నియమితులయ్యారు. అలా నియమించబడిన వారే ఏపీలో నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి.. అటు తెలంగాణలో కెసిఆర్ సైతం ఉపముఖ్యమంత్రి పదవులను సృష్టించారు. రాజయ్య తో పాటు మరొక్కరిని నియమించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అదే సంస్కృతిని కొనసాగించగా.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఈ సంస్కృతిని మరింత పెంచారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదాలో కల్పించారు. సామాజిక సమీకరణలకు పెద్దపీట వేస్తూ తాము రాజ్యాధికారంలో అవకాశం కల్పించామని చెప్పుకున్నారు. కానీ ప్రజలు విశ్వసించలేదు.
అన్ని రకాలుగా గౌరవం..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. తెలంగాణలో భట్టి విక్రమార్క, ఏపీలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే ఏపీలో మాత్రం పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీ సీఎం కాగా అన్ని రకాల గౌరవ మర్యాదలు దక్కించుకుంటున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సీఎం చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది. ఆపై పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల శాఖలకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. పాలనలో తన మార్కు చూపించగలుగుతున్నారు. రాజకీయ ప్రకటనలు చేయగలుగుతున్నారు. ప్రభుత్వంలో సీఎం చంద్రబాబుతో సమానంగా గౌరవం దక్కించుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి అవుతారా అంటే మాత్రం.. దానికి సమాధానం లేకుండా పోతోంది. కానీ ఏ ఉప ముఖ్యమంత్రి కి దక్కని అన్ని రకాల గౌరవం, ఆపై దర్పం మాత్రం ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.