India : మోడీ ఇటీవల రైజింగ్ భారత్ సమ్మిట్ లో మాట్లాడుతూ ఓ వినూత్న వాదన వినిపించారు. కాంగ్రెస్ అధికారం కోసం ఎక్కడిదాకా అయినా వెళుతుంది. దేశ విభజనకు ఒప్పుకుంది. మనతో పాటు విడిపోయిన దేశాలు ఎలాంటి విభజన, షరతులు లేకుండా స్వాతంత్ర్యం పొందినప్పుడు భారత్ కు విభజనతోటి స్వాతంత్ర్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ తెచ్చింది. అతి కొద్ది దేశాల్లోనే ఈ షరతులు ఉన్నాయి.. సౌతాఫ్రికా లాంటి నమీబియా లాంటి దేశాలు ఏర్పడ్డప్పుడు ఆ దేశ లక్షణాలను బట్టి విభజించారు. కానీ మతం ప్రాతిపదికన దేశాన్ని విభజించడం కాంగ్రెస్ ఎలా బ్రిటీష్ వారి నుంచి ఒప్పుకుందని మోడీ నిలదీశాడు.
మోడీ చెప్పనిది హిస్టరీలో ఇంకోటి ఉంది. అసలు అహింస ద్వారా స్వాతంత్ర్యం వచ్చినదని చెప్పుకునే కాంగ్రెస్ వాదులు.. బ్రిటీష్ వారు పెట్టిన షరతులతో లక్షలాది మందిని బలిగొని స్వాతంత్ర్యం తెచ్చుకున్నామన్నది కఠోర నిజం.
తేదీలు మార్పు కావచ్చు. 1947 తర్వాత దేశ విభజన పేరతో లక్షలాది మంది హిందూ, ముస్లిం, సిక్కులు తెగనరక్కొని విభజించపడ్డారు. ఇది చరిత్ర.. కొట్టుకుచచ్చారు.
స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఎన్ని వక్రీకరణల.. కాంగ్రెస్ తీసుకొచ్చిందే ఈ స్వాతంత్ర్యం అన్నట్టు ఫోకస్ చేస్తారు.
సావర్కర్, ఘోష్, సన్యాల్ వంటి వారు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా లండన్ లో, భారత్ లో పోరాడిన వారి గురించి పాఠ్య పుస్తకాల్లో లేకుండా చేశారు. కాంగ్రెస్ ఆరోజుకు బ్రిటీష్ ను స్వాతంత్య్రం కోసం అడుక్కున్నారు.
స్వాతంత్రోద్యమ చరిత్రకెందుకు ఇన్ని వక్రభాష్యాలు.. దీనిపై ‘రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.