Andhra Pradesh : రాజకీయాల్లో చిన్న చిన్న పొరపాట్లే చాలా కాస్లీగా మారుతాయి. ఏపీలో చక్కగా నడుస్తున్న పాలనలో విషపు బొట్లుగా మారారు. ఈరోజు ఇద్దరు పార్టీల అధినేతలు ప్రో యాక్టివ్ గా స్పందించారు. ఏపీ క్యాబినెట్ మంత్రి టీజీ భరత్ కు దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు బృందంతో ఆయన వెళ్లారు. అక్కడ ఏదో పెట్టుబడుల గురించి మాట్లాడితే సరిపోయేది. కానీ ఈ రాష్ట్రానికి సీఎం అయ్యే అర్హత లోకేష్ కు ఉందని.. హైలీ ఎడ్యుకేటెడ్ అంటూ తెగ పొగిడేసారు భరత్. అంతటితో ఆగకుండా కూటమి పార్టీల్లోని 164 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీల్లో స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఏకైక నేత నారా లోకేష్ గా అభివర్ణించారు. ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా.. ఎవరికి ఇష్టం లేకపోయినా లోకేష్ బెస్ట్ సీఎం అవుతారని తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. దీంతో చంద్రబాబు పక్కకు పిలిచి పెట్టుబడుల సదస్సులో ఇలా మాట్లాడిన టీజీ భరత్ కు క్లాస్ పీకారు. ఇలాంటివి కూటమి ప్రభుత్వానికి చేటు అని హెచ్చరించారు.
ఇక పవన్ కళ్యాణ్ కూడా జనసేన తరుఫున ఎవరూ ‘డిప్యూటీ సీఎం’ పదవిపై మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ టాపిక్ తో మనం నష్టపోతున్నామని..కలవడానికి చాలా టైం పడుతుందని.. విడిపోవడానికి చిన్న సంఘటన చాలు అంటూ రెండుపార్టీల నేతలు గుర్తించారు.
ఇక మహాసేన రాజేశ్, వేమూరి రాధాకృష్ణ లాంటి వారు రెండు పార్టీల మధ్య ఈ చిచ్చుకు కారణమయ్యారు. వ్యూహాత్మకంగా లోకేష్ ను లేపుతున్న ఈ కుట్రను చంద్రబాబు గుర్తించి అదుపు చేస్తున్నారు. ఈ పరిణామాలు అయితే హర్షించదగ్గనివి కావు..
కలహించుకుంటే నష్టపోయేది మీరే కాదు ఆంధ్రా కూడా.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.