Premalu 2 Movie : గత ఏడాది చిన్న సినిమాల హవా ఏ రేంజ్ లో ఉన్నిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎలాంటి చప్పుడు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకున్నాయి. డబ్బింగ్ సినిమాలు సైతం మన టాలీవుడ్ లో సత్తా చాటాయి. మలయాళం డబ్బింగ్ సినిమాలను మన తెలుగు ఆడియన్స్ అంతగా ఇష్టపడరు. ఎందుకంటే చాలా స్లో స్క్రీన్ ప్లే తో ఉంటాయని. కానీ గత ఏడాది విడుదలైన ‘ప్రేమలు’ అనే మలయాళం డబ్బింగ్ సినిమాకి మన తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. మలయాళం లో సూపర్ హిట్ గా నిల్చిన ఈ క్యూట్ లవ్ స్టోరీ ని తెలుగు లో కూడా అదే పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. రెస్పాన్స్ అదిరిపోయింది. ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి సీక్వెల్ ని గత ఏడాదే ప్రకటించారు మేకర్స్.
పార్ట్ 1 లో సచిన్ , రీను మధ్య లవ్ స్టోరీ క్లైమాక్స్ నుండి మొదలు అయ్యే సంగతి తెలిసిందే. యునైటెడ్ కింగ్డమ్ స్టేట్ కి వెళ్లిన సచిన్, హైదరాబాద్ లో ఉండే రీను మధ్య జరిగే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ ని పార్ట్ 2 లో చూపించబోతున్నాడు దర్శకుడు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్స్ వల్ల ఏర్పడే సందర్భాలను చాలా ఫన్నీ గా చెప్పే ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేయబోతున్నారు. మధ్యలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉంటాయట. ఈ చిత్రాన్ని ప్రముఖ మలయాళం హీరో, పుష్ప ఫేమ్ ఫహద్ ఫాజిల్ నిర్మిస్తున్నాడు. మొదటి భాగాన్ని కూడా ఇతనే తన స్నేహితులతో కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి అనువైన లొకేషన్స్ కోసం మూవీ టీం వెతుకుతుంది. వచ్చే నెల నుండి షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టి, ఈ ఏడాది ద్వితీయార్థం లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
ఈ సినిమా ద్వారా హీరోయిన్ మమిత బైజు కి ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో దర్శక నిర్మాతలు ఈమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈమె కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ ఆఖరి చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈమధ్యనే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ చిత్రం అప్పుడే చివరి దశకు చేరుకుందట. తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి ఇది రీమేక్. హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా, మమిత బైజు తెలుగు లో శ్రీలీల పోషించిన క్యారక్టర్ ని తమిళంలో చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఆమె ప్రేమలు సీక్వెల్ లో నటించబోతుంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.