One Year of TDP-Led Govt: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయ్యింది. ఇది తక్కువ టైం ఏం కాదు.. అలాగని ఎక్కువ సమయం కూడా కాదు. అసలు ఎలా ఉంది పాలన అనే ముందు.. ప్రజలు ఎన్నికల ముందు ఏం ఆశించారు? అవి నెరవేరాయా? అన్నది చూద్దాం.
రాజధాని లేని రాష్ట్రం కు రాజధాని కావాలన్నది ప్రజల డిమాండ్. అమరావతికి పునాదులు పడ్డాయి. టెండర్లు ముగిసి పనులు మొదలయ్యాయి. చకచకా జరుగుతున్నాయి. అమరావతి ఒక రాజధాని గా సంవత్సర పాలనలో ఒక ముద్ర వేసుకుంది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. వచ్చే పార్లమెంట్ లో దాన్ని ప్రవేశపెట్టబోతోంది.అమరావతికి కేంద్రం డబ్బులు సమకూర్చింది.
రెండోది పోలవరంకు కేంద్రం 12వేల కోట్లు తక్షణం సాయం చేయడంతోపాటు విదేశీ నిపుణులతో ఒక యజ్ఞంలా పూర్తి చేయబోతున్నారు. రెండేళ్లలో పూర్తి చేయబోతున్నారు. మూడోది వైజాగ్ స్టీల్ ప్లాంట్.. దీనికి కేంద్రం 12 వేల కోట్లతో కేంద్రం సమకూర్చి పునరుద్దరించింది.
ఇక రైల్వే జోన్ ప్రధాని స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. ఈ నాలుగింట్లోనూ ఆంధ్రాకు అనిశ్చితి తొలిగింది. ఆంధ్ర కూటమి ప్రభుత్వం సంవత్సరపు పాలనలో ఎదుర్కొంటున్న సవాళ్ళు అపవాదులేంటి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
