Tamil Nadu Elections 2026: తమిళనాడులో ఎన్నికలకు ఇంకా ఆరునెలల సమయం ఉంది.. కానీ ఎన్నికల యుద్ధ వాతావరణం అప్పుడే వచ్చేసింది. అన్ని పార్టీలు కూడా ఎన్నికల రణరంగంలో గ్రౌండ్ లెవల్ లోకి వచ్చేశాయి. అందరికన్నా ముందు మొదలుపెట్టింది అన్నాడీఎంకే. జులైలోనే ఫళని స్వామి ఈ ఎన్నికల యాత్ర నిర్వహించడం మొదలుపెట్టాడు. అక్టోబర్ చివరి వరకూ 5 యాత్రలు అయిపోయాయి. ‘సేవ్ పీపుల్.. సేవ్ తమిళియన్’ అంటూ తమిళనాడును చుట్టేస్తున్నారు.
ఇప్పుడు కొత్తగా ఉదయనిధి స్టాలిన్ మొదలుపెట్టాడు. కాంచీపురం నుంచి డీఎంకే ప్రచారం మొదలైంది. 76 జిల్లాల యూనిట్ల ఇండోర్ మీటింగ్ పెట్టి యాత్ర మొదలుపెట్టారు. ఎంకే స్టాలిన్ సెప్టెంబర్ 15 అన్నాదురై బర్త్ డే నాడు 68వేల పోలింగ్ బూత్ ల దగ్గర మీటింగ్ పెట్టి ప్లెడ్జ్ తీసుకోమన్నాడు. ‘సేవ్ తమిళం.. సేవ్ తమిళియన్’ అంటూ బెంగాల్ లో మమత చేసినట్టే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.
సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 20 వరకూ మరో హీరో టీవీకే విజయ్ ‘తిరుచనాపల్లి’ నుంచి మొదలై యాత్ర కొనసాగనుంది. ఇక బీజేపీ కూడా పోలింగ్ బూత్ ఇన్ చార్జిలతో మూడు జిల్లాలకు ఒక మీటింగ్ చొప్పున పెడుతున్నారు. మొదటి మీటింగ్ కు అమిత్ షా వచ్చారు. ఇక ఎన్టీకే సీ మ్యాన్ ఒక్కడే తిరుగుతున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏం పట్టించుకోవడం లేదు. తమిళనాడులో బేస్ ఉన్నా అసలు ప్రచారం నిర్వహించడం లేదు.
తమిళనాడులో మూడు ప్రధాన పార్టీల ఎన్నికల యాత్రలు షురూ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
