https://oktelugu.com/

Caste Census : కులగణన సూత్రం అన్ని మతాలకూ వర్తించాలి

కులగణన సూత్రం అన్ని మతాలకూ వర్తించాలి అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు

Written By: , Updated On : September 3, 2024 / 08:57 PM IST

Caste Census : కులగణన.. ఇది రాజకీయాల్లో అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా ముందుకొచ్చింది. చివరకు ఆర్ఎస్ఎస్ కూడా పాలఘాట్ సమావేశంలో కులగణన జరిగితేనే మంచిదని అభిప్రాయపడింది. ఆధునిక సమాజంలో కులం పాత్ర తగ్గిపోతోంది. మతం ప్రాముఖ్యత తగ్గలేదు. కానీ కులం వచ్చేసరికి పూర్తిగా కనుమరగవుతోంది. కుల వృత్తి ఎవరూ చేయడం లేదు. పట్టణీకరణ ఎక్కువగా జరుగుతోంది. కులాలు అంతరించిపోతున్నాయి.

అన్ని వ్యాపారాలు అందరూ చేస్తున్నారు. సంక్షేమ పథకాల్లో పేదలకే అందుతుంది కానీ కులానికి ప్రాముఖ్యత లేదు. రాజ్యాంగ చెప్పిన విద్యా, ఉద్యోగ రంగాల్లో కులంతో కాకుండా ఆర్తిక వెనుకబాటు ఆధారంగా తీసుకొని స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నారు.

కులం పేరుతో హాస్టల్స్ పెట్టడం అంత మంచిది కాదు.. విద్యార్థులను కులం పేరుతో విడదీయవద్దు.. భారత్ భవిష్యత్ నాశనం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చాలా స్వల్పం.. ప్రైవేటు రంగంలో అసలు కులం, మతం లేదు. మెరిట్ ప్రకారం నడుస్తోంది. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే రిజర్వేషన్లు ఉన్నాయి. దానికోసమే కొట్టుకుంటూ ఉంటున్నాం. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల్లో తప్పితే కులం ప్రాముఖ్యత పోయింది.

కులగణన సూత్రం అన్ని మతాలకూ వర్తించాలి అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు

కులగణన సూత్రం అన్ని మతాలకూ వర్తించాలి |Do you know that there is no religion without caste in India?