Annamalai : రేపు మార్చి 5వ తేదీన చెన్నైలో ఓ అఖిలపక్ష సమావేశాన్ని స్టాలిన్ పిలిచారు. 45 పార్టీలకు ఆహ్వానం పలికారు.చిన్నా చితక పార్టీలను కూడా పిలిచారు. సబ్జెక్ట్ ఏంటంటే. . తమిళనాడులో 39 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అవి 31కి తగ్గబోతున్నాయట.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నే ఈ విషయం బయటపెట్టాడు. ఇది ఊహాగానం కాదు.. డీలిమిటేషన్ ఎప్పుడు జరుగబోతోంది అంటే 2026 జనాభా లెక్కల తర్వాత ఈ పునర్విభజన జరుగనుంది.
మరి ఇప్పుడు ఎందుకు స్టాలిన్ డీలిమిటేషన్ బెంగ పట్టుకుంది. ఎవరు ఇచ్చారు ఈ ఇన్ఫర్మేషన్..దీనికి ఆదారం ఏమిటి? సాక్షాత్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం సంచలనమైంది.
ఈ భేటికి బీజేపీ, టీఎంసీలు గైర్హాజరు అవుతున్నట్టు పేర్కొన్నాయి. హీరో విజయ్, సీమెన్ పార్టీ హాజరు అవుతుందో లేదో తెలియదు.. ముందుగా స్టాలిన్ కు ఎక్కడ నుంచి ఈ ఆధారం వచ్చింది. అది రియలబుల్ సోర్స్ అయితే బయటపెట్టొచ్చు కదా? అని ప్రశ్నిస్తున్నారు.
అఖిల పక్ష సమావేశానికి అన్నామలై గైరు హాజరు కరెక్టేనా? ఆయన వాదనలో నిజమెంత? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
