Naveen Patnaik : ఒడిశాలో ఈసారి ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అందరిలో ఉంది. ఇవాళ ఒడిశాలో నవీన్ పట్నాయక్ కు తిరుగులేదు. మచ్చలేని నాయకుడు. నవీన్ ను వ్యక్తిగతంగా వేలెత్తి చూపించరు. ఆయన ఆరోగ్యం బాగా లేదు.నడిచే పరిస్థితిలో లేడు. పార్టీని అయినా.. ప్రభుత్వాన్ని అయినా నవీన్ పట్నాయక్ పేరుతో వీకే పాండ్యన్ నే నడుపుతున్నాడు.
వీకే పాండ్యన్ తమిళియన్. మధురై వాసి. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గా ఒడిశాలో ఎంతో సేవ చేశారు. ఒరియా అమ్మాయిని చేసుకొని ఇక్కడే సెటిల్ అయ్యారు. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం గెలిస్తే వారసుడిగా వీకే పాండ్యన్ ను నియమిస్తాడనేది ఒడిశాలో ఎవరిని అడిగినా చెబుతాడు.
ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. ఇన్ని సార్లు ప్రభుత్వంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. నాన్ ఒడియన్ అయిన తమిళ వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నాడన్న భావన ప్రజల్లోకి వెళ్లింది.
దీంతోఈసారి బీజేడీ కి ఎదురుగాలి వీస్తుందని.. బీజేపీ వైపు జనం మొగ్గుతున్నారని అంటున్నారు.
ఒడిశాలో నవీన్ పట్నాయక్ కు స్వంత జిల్లాలోనే ఎదురుగాలి వీస్తుందట.. ఒడిశాలో పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.