Rahul Gandhi vs Jaishankar : కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలు వివాదాస్పదమయ్యాయి. జైశంకర్ ను జైచంద్ జైశంకర్ అంటూ రాహుల్ నోరుపారేసుకోవడం విమర్శలపాలైంది. చరిత్రలో ఈ పేరంటని చూస్తే 1192లో రెండో తరైన్ యుద్ధంలో మహ్మద్ ఘోరి.. ఫృథ్వీరాజ్ చౌహాన్ ను ఓడించాడు.అదే ఇస్లామిక్ రాజ్య స్థాపనకు భారత్ లో పునాధి పడింది. ఇది అందరికీ తెలిసిన చరిత్ర.
కన్నోజు మహారాజు జైచంద్.. ఈయన మహ్మద్ ఘోరికి మద్దతు ఇచ్చాడు అన్నది చరిత్రలో చెబుతారు. జైచంద్ ను దేశద్రోహిగా అభివర్ణిస్తుంటారు. జైశంకర్ ను ఇప్పుడు జైచంద్ అంటూ విమర్శించడంతో రాహుల్ గాంధీ అాసుపాలయ్యారు.
ఒక విదేశాంగ మంత్రిని పట్టుకొని పాకిస్తాన్ కు ఉప్పందించాడని.. జైశంకర్ లాంటి వ్యక్తిని విమర్శించడంతో రాహుల్ పై విమర్శలు వెల్లువెత్తాయి.
జైశంకర్ పై దేశద్రోహ ఆరోపణలతో సెల్ఫ్ గోల్ వేసుకున్న రాహుల్ గాంధీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చెప్పొచ్చు.