https://oktelugu.com/

Rahul Gandhi : తిరిగి కాశ్మీర్ లో వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టటం తగునా రాహుల్ గాంధీ

తిరిగి కాశ్మీర్ లో వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టటం తగునా రాహుల్ గాంధీ.. ఆయన తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2024 / 06:47 PM IST

    Rahul Gandhi : రాహుల్ గాంధీ నిన్న కశ్మీర్ సభల్లో మాట్లాడుతూ ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించాడు. ఒకటి మమ్మల్ని గెలిపిస్తే రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని వాగ్ధానం చేశాడు. ఇక రెండోది ఎల్జీ మనోజ్ సిన్హా కింగ్ లాగా ప్రవర్తిస్తున్నాడు. 1947లోనే మహారాజ అని పిలిపించుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త కింగ్ వచ్చాడు. బయట వాళ్లు మీ హక్కులను హరిస్తున్నారు. మీ లాభాలను హరిస్తున్నారు. కాంట్రాక్టులన్నీ వారికే వస్తున్నాయని ఆరోపించారు.

    రాష్ట్ర హోదా అన్నది ప్రతీ పార్టీ హామీలిచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. పార్లమెంట్ లో హామీ ఇచ్చింది మోడీ. అమలు చేయగలిగింది మోడీ. ఇక్కడ కశ్మీర్ లో ఎవరు గెలిచినా కేంద్రంలో అధికారంలోకి వస్తేనే మార్చగలరు.

    లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ను విమర్శించడం అంటే దేశ ద్రోహమే. ఇప్పటికీ వచ్చిన గవర్నర్స్ లో ఇంతగా కశ్మీర్ ప్రజలను ఆకట్టుకున్న గవర్నరే లేడు అని చెప్పొచ్చు. ప్రతీ ఒక్కరూ ఆయన్ను గౌరవిస్తున్నారు. వివాదాల్లోకి లాగడం లేదు. ప్రతీ వాళ్లు మనోజ్ సిన్హాతో మాట్లాడుతున్నారు. పంచాయితీలకు డైరెక్ట్ గా నిధులు పంపిస్తున్నాడు. ప్రతీ గ్రామానికి ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ క్రియేట్ చేశాడు. కశ్మీర్, జమ్మూలో ప్రజలతో మిళితమై వారి హృదయాలను గెలుచుకున్న ఏకైక వ్యక్తి మనోజ్ సిన్హా.

    తిరిగి కాశ్మీర్ లో వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టటం తగునా రాహుల్ గాంధీ.. ఆయన తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.