Pooja Pal creates sensation in UP : ఉత్తరప్రదేశ్ లో ఓ 45 ఏళ్ల ఆవిడ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఆవిడ గురించే మాట్లాడుతున్నారు. ఓ సంఘటన అసెంబ్లీలో జరిగింది. ‘పూజా పాల్’ అనే పేద కుటుంబంలో పుట్టిన మహిళ గురించి మాట్లాడుకుంటున్నారు.
పూజా పాల్ సమాజ్ వాదీ పార్టీ నుంచి కౌసంబి జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. 13,14 వ తేదీల్లో 24 గంటలు అసెంబ్లీ నిర్వహించారు. విశిష్ట యూపీ కోసం ఓ ప్రణాళికలు రచించేందుకు 24 గంటలు చర్చను విరామం లేకుండా చేశారు.
పూజా పాల్ ఈ చర్చలో ఓ అద్భుత చర్చ చేశారు. ‘ఈరోజు నా కల నెరవేరింది. నా భర్తను చంపిన వ్యక్తిని యూపీ సీఎం యోగి మట్టికరిపించాడు. నా ధన్యవాదాలు.. నేనే కాదు.. పేద ప్రజలు, తల్లులు, చెల్లెల్లు కూడా ప్రయాగ్ రాజ్ లో ఊపిరి పీల్చుకొని స్వేచ్చ అనుభవిస్తున్నారని.. దీనికి కారణం యూపీ సీఎం యోగిని ఆయనను వ్యతిరేకించే సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే పేర్కొనడం సంచలనమైంది.
అసలు పూజా పాల్ ఎవరు? ఆమె భర్త ఎలా చంపబడ్డాడు. యోగి చేసిందేంటి? యూపీ అసెంబ్లీలో సంచలనం సృష్టించిన పూజా పాల్ గురించి ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
