Tamil Nadu : తమిళనాట ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరింది. ఎందుకంటే అది మొదటి దఫాలో జరుగబోతోంది. ఏప్రిల్ 19వ తేదీన తమిళనాడు ఎన్నికలు మొత్తం ఒకేరోజు జరుగబోతున్నాయి. తమిళనాడులో 30 స్థానాలు..పుదుచ్చేరి ఒక ఎంపీ సీటుకు ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంట్లో భాగంగా మోడీ, అమిత్ షాల పర్యటనల షెడ్యూల్ ఖరారయ్యాయి..
అమిత్ షా వచ్చి నిన్న ఇవాళ రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్ లు చేస్తున్నాడు. నిన్న టీటీవీ దినకరన్ రోడ్ షో, మధురైలో పబ్లిక్ మీటింగ్.. కరైకూడి, టెంకసీ, కన్యాకుమారిలో రోడ్ షో నిర్వహిస్తున్నారు.
మోడీ పర్యటన చూస్తే.. 9న వెల్లూరులో రోడ్ షో, పబ్లిక్ మీటింగ్ హాజరుకాబోతున్నారు. వెల్లూరులో జరిగే మహాసభకి చుట్టుపక్కల పోటీచేసే వాళ్లంతా వెల్లూరుకు వచ్చి మోడీ ద్వారా ప్రచారం చేయబోతున్నారు. 4 గంటలకు ఈ ప్రోగ్రాం అయిపోయాక.. సాయంత్రం 6 గంటలకు చెన్నైలో మహాసభ నిర్వహించనున్నారు. చెన్నైలో పానగల్ పార్క్ నుంచి మోడీ రోడ్ షో నిర్వహించనున్నారు. చెన్నై సౌత్ మోడీ రోడ్ షో ఉండబోతోంది.
10వ తేదీన ఊటి నీళగిరిలో మోడీ పర్యటన ఉండబోతోంది. అక్కడ రోడ్ షో, సాయంత్రం కోయంబత్తూరులో పబ్లిక్ మీటింగ్ జరుగబోతోంది. అన్నామలై నియోజకవర్గమైన కోయంబత్తూరులో మోడీ ప్రసంగించనున్నారు.
మోడీ రోడ్ షోలు, సభలతో హోరెత్తబోతున్న తమిళనాడు రాజకీయాలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.