Pawan Kalyan : ఏ వ్యూహమైనా.. అది విజయవంతమైందా? ఫెయిలైందా? అని నిర్ణయించేది సత్ఫలితాలు వచ్చినప్పుడే.. ఫలితాల మీదనే ఆ నేత విజయవంతం ఆధారపడి ఉంది. ఇప్పటికీ క్యూబా విప్లవ నేత ‘చేగువేరా’ను ప్రపంచమంతా గుర్తు పెట్టుకునేది అందుకే.. గాంధీని మహాత్ముడు అని ఎందుకు కొనియాడుతున్నామంటే ఆయన వల్లే భారత్ కు స్వాతంత్ర్యం సిద్దించింది కాబట్టి.. ఎన్టీఆర్ ను ఎందుకు స్మరించుకున్నామంటే ఆయన ఆలోచనలు తెలుగు ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కాబట్టి..
మనం ఎన్నైనా విశ్లేషించుకోవచ్చు. అల్టిమేట్ గా అది విజయవంతమైనప్పుడే గుర్తింపు దక్కుతుంది. అప్పుడే వారిని అభినందించాల్సిన అవసరం ఉంది. భారత్ లో మూడోసారి గెలుపుతో మోడీ పాపులర్ అయ్యారు. వ్యూహాలు, ఆలోచనలు సక్సెస్ అయినప్పుడే నేతలకు విలువ దక్కుతుంది.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యూహాలు, ఆలోచనల గురించి చర్చిద్దాం.. పవన్ ఆలోచనలు వ్యూహాలు అద్భుతంగా విజయవంతమయ్యాయని అందరూ పొగుడుతున్నారు. ఆరోజు ఏటికి ఎదురేగారు పవన్. ఆంధ్రా రాజకీయాల్లో పవన్ వ్యూహం అద్భుతంగా పనిచేసి విజయాన్ని తెచ్చిపెట్టింది.
పవన్ కళ్యాణ్ వ్యూహం సర్వత్రా ప్రశంసలందుకుంది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.