Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లు.. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేరళలో మునంబం బాధితులు వక్ఫ్ సవరణ బిల్లు కావాలని ఎలా కోరుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఇవాళ అసలు ముస్లింలలోనే కొందరు దీనికి అనుకూలంగా మారుతున్నారు. ముస్లింలలో కొందరు సామాన్యులలో , పేదవారంతా కూడా వక్ఫ్ బిల్లు రావాలని కోరుకుంటున్నారు. పేద ముస్లింలకు వక్ఫ్ బోర్డు నుంచి ఎలాంటి ఆదాయం రావడం లేదు. వారి వాయిస్ టీవీల్లో వినిపించడం లేదు. ముల్లాలు, మల్లాల వాయిస్ నే వినిపిస్తోంది. వారికి మద్దతు ఇచ్చే ఓటు బ్యాంకు రాజకీయాల వారిదే వినిపిస్తోంది.
భారత్ లో ఇవాళ పస్మండాలు కీలకంగా ఉన్నారు. ముస్లింలలో కొద్ది శాతం వీరు ఉన్నారు. టర్కీ, పర్షియా నుంచి వచ్చిన వారు కొద్ది శాతమే. ఇక్కడ కన్వర్ట్ అయిన వారు కొద్ది శాతం.. నిజంగా మిగిలిన కులీన వర్గాలు ముస్లిం రాజకీయాలు శాసిస్తున్నారు. మసీదు, వక్ఫ్ లను శాసిస్తున్నారు. సామాన్య ముస్లింలకు ప్రయోజనం కలిగించకుండా దోచుకుంటున్నారని ఆరోపణలున్నాయి.
ఓబీసీలు, దళితులు వీరు ముస్లింలుగా కన్వర్ట్ అయిన వారికి అభివృద్ధి, రాజకీయ ఫలాలు కావడం లేదు. వీరికి పెళ్లిళ్లు చేసుకోవడానికి కూడా అష్రఫ్ లు ఇష్టపడడం లేదు.
పస్మండాలు మహిళలు షియాలు బ్రోహాలు వక్ఫ్ సవరణ బిల్లుకి సానుకూలం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.