https://oktelugu.com/

Bihar Madrasas : వక్ఫ్ చట్టం లాంటిదే విద్యాహక్కు చట్టం కూడా

వక్ఫ్ చట్టం లాంటిదే విద్యాహక్కు చట్టం కూడా.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : August 20, 2024 2:38 pm

    Bihar Madrasas : యూపీఏ హయాంలో సమాజానికి పట్టిన దరిద్రం ఒక్కటి కాదు.. ‘వక్ఫ్’ చట్టం ఎంత దారుణాతి దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సమాజాన్ని మత పరంగా కాంగ్రెస్ విభజించింది. హిందూ, ముస్లింలలో విభేదాలు తీసుకొచ్చి సమాజాన్ని విడగొట్టింది యూపీఏ ప్రభుత్వం. పైగా సెక్యూలరిస్ట్ లు అంటారు ఈ కాంగ్రెస్ వాళ్లు. కానీ వారికి అలా అనే అర్హత లేదు.

    విద్యాహక్కు చట్టం పేరుతో మతాల మధ్యన యూపీఏ ప్రభుత్వం విభేదాలు తీసుకొచ్చింది. 2005లో రాజ్యాంగ సవరణలు చేసింది. 25 శాతం విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చింది. అయితే ఇందులో మైనార్టీ సంస్థలకు మినహాయింపునిచ్చింది.

    సమాజంలో అణగారిన వర్గాలకు ఇవ్వాలనుకుంటే మైనార్టీలకు ఎందుకు మినహాయింపును కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని హిందువులంతా రగిలిపోయారు. ఈ చట్టం తర్వాత మైనార్టీ విద్యాసంస్థలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చి దోచుకున్నారు. దీంతో తమకు అన్యాయం జరుగుతోందనే హిందువులు అంతా బీజేపీని గెలిపించారు.

    వక్ఫ్ చట్టం లాంటిదే విద్యాహక్కు చట్టం కూడా.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    వక్ఫ్ చట్టం లాంటిదే విద్యాహక్కు చట్టం కూడా || NCPCR chief flags radical curriculum in Bihar madrasas