రాజమౌళి వ్యాఖ్యల మీద చేసిన వీడియో అత్యంత వివాదాస్పదమైంది. నా సబ్ స్క్రైబర్స్ ఈ అభిప్రాయాన్ని తిరస్కరించారు. మీ హృదయాన్ని గాయపరిచినందుకు క్షమించండి. రాజమౌళి వ్యాఖ్యలు ఏంటో చూస్తే.. ‘రాజమౌళి దేవుడిని నమ్మనప్పుడు.. దేవుడిపై ఎందుకు సినిమాలు చేస్తున్నాడు? ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నాడు. హనుమంతుడిని అవమానించి భక్తులను అగౌరపరిచాడు. తను సెలబ్రెటీ అయ్యిండి ఇలా దేవుళ్లపై నమ్మకం లేదని ఇలా అనడం కరెక్ట్ కాదు అన్నది మెజార్టీ శ్రోతల అభిప్రాయం..
రాజమౌళి సినిమా వేడుకలో దేవుడి గురించి మాట్లాడడం.. నాస్తికుడని.. దేవుళ్లను నమ్మం అనడం రాజమౌళిది కరెక్ట్ కాదు అన్నది ఒప్పుకోవాల్సిందే..
లక్షల మంది చూసే షోలో దేవుళ్లపై నమ్మను అనడం సహేతుకం కాదు. వారణాసి అనే దేవుడి సినిమా చేస్తూ ఇలా రాజమౌళి వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు. ఇందులో శ్రోతల అభిప్రాయం కరెక్ట్..
రాజమౌళి వ్యాఖ్యలపై ‘రామ్’ గారి వీడియోపై శ్రోతల్లో తీవ్ర అసంతృప్తి . దీనిపై ‘రామ్’ గారి వివరణ..