Maruti Suzuki: నిన్న ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ ఇచ్చి వార్త మనకు సంతోషాన్నిచ్చింది. టారిఫ్ భయాల వేళ టాప్ 10 ఆటోమేటర్స్ ఏవి ఉంటాయని చూస్తే.. ఇండియన్ కార్ మేకర్ ‘మారుతి సుజుకి’ 8వ స్థానానికి ఎగబాకింది. టారిఫ్ లతో కుదేలు అవుతాయని అనుకుంటే.. జీఎస్టీ మోడీ సర్కార్ తగ్గింపుతో ఈ కార్ల ధరలు తగ్గాయి. ఇది ఎగుమతులకు, దేశంలో వినియోగం పెరిగింది. దీంతో టాప్ 10లోకి మారుతి సుజుకీ దూసుకెళ్లింది.
మన మారుతి సుజుకీ టాప్ 10లోకి రావడం భారత్ కు గర్వకారణం. టెస్లా 1472 బిలియన్ డాలర్లతో నంబర్ 1గా నిలుస్తోంది. తర్వాత టయోటా 314 బిలియన్ డాలర్లతో జపాన్ ది రెండో స్థానంలో ఉంది. ఇక మారుతి సుజుకీ టాప్ 8 లో 58 బిలియన్ డాలర్లతో నిలిచింది. టాప్ 5లో ఉన్న బీఎండబ్ల్యూ కేవలం 61 బిలియన్ డాలర్లతో 5వ స్థానంలో ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే టాప్ 5లోకి మారుతి సుజుకీ చేరనుంది.
మారుతి సుజుకీ పెద్ద వాళ్ల కార్ల కంపెనీ కాదు. 60 శాతం చిన్న కార్ల కంపెనీనే.. మధ్యతరగతి వర్గానికి అందుబాటులో ఉన్న ఈ కారు కంపెనీ దూసుకుపోతోంది. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ రేట్లు పడిపోవడంతో కొనేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. రోజుకు 15వేల బుకింగ్స్ జరుగుతోంది. సెప్టెంబర్ 22 రోజు 30వేల కార్లు డెలివరీ ఇచ్చారు.
ప్రపంచ ప్రఖ్యాత కార్ల సరసన మారుతీ సుజుకీ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.