Money problems: జీవితాన్ని నడిపించేది డబ్బు.. మనిషిని బతికించేది డబ్బు.. డబ్బు లేకుంటే ఏ పని జరగదు. డబ్బు కోసమే జీవితం.. అనే విషయం చాలామందికి తెలుసు. అయితే డబ్బు అనేది అవసరాలకు మాత్రమే.. అదే జీవితం కాదని కొందరు మేధావులు చెబుతూ ఉంటారు. డబ్బును అవసరంగా మాత్రమే చూడాలని.. డబ్బు కోసం విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కూడా చెబుతూ ఉంటారు. అయినా కూడా డబ్బుపై ఎవరికి మమకారం తగ్గదు. ఒకరిని చూసి మరొకరు.. ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. ఇలా జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు. అయితే ఒక మనిషికి డబ్బు పై ఆశ ఎప్పుడు తగ్గుతుంది? ఎప్పుడూ డబ్బులు దూరంగా పెట్టగలుగుతాడు?
ఒక చిన్న పిల్లవాడికి ఒక చాక్లెట్ ఇవ్వగానే.. మరొకటి కావాలని ఏడుస్తాడు.. అలాగే డబ్బు కూడా కొంత సంపాదించగానే తృప్తిగా ఉండదు.. మరింత సంపాదించాలని అనుకుంటారు. ఎందుకంటే డబ్బు రాగానే జీవితం మారిపోతుంది. అప్పటివరకు సైకిల్ పై తిరిగేవారు బైక్ కొంటారు.. మరికొంత డబ్బు రాగానే కారు కొనుగోలు చేస్తారు.. ఇలా ఎంత ఎక్కువ డబ్బు వస్తే అంత ఖర్చులు పెరుగుతాయి.. ఖర్చులకు తగినట్లు ఆదాయం పెరిగేలా కష్టపడుతూ ఉంటారు. అయితే కొందరు నాకు ఒక కోటి రూపాయలు వస్తే బాగుండు.. ఎక్కువ అవసరం లేదు.. అని అంటూ ఉంటారు. ఒకవేళ అతనికి కోటి రూపాయలు వస్తే.. మరో కోటి కోసం కచ్చితంగా కోరిక ఉంటుంది. ఇలా 10 కోట్లు.. 20 కోట్లు.. అతని కోరికకు అంతు ఉండదు.
నిజం చెప్పాలంటే డబ్బు పై ఆశ బతికి ఉన్న సమయంలో తగ్గదు. మరణిస్తేనే తప్ప డబ్బుకు దూరంగా వెళ్లలేడు. పుట్టిన పిల్లవాడి నుంచి.. వృద్ధుల వరకు వేచిన అవసరం అయినా.. డబ్బుతోనే పని ఉంటుంది. అందువల్ల డబ్బు లేకుంటే జీవితం సాగదు. అంతేకాకుండా డబ్బుపై ఆశ కూడా చావదు.
అయితే అందమైన జీవితం కావాలని అనుకుంటే డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. జీవిత విలువలు కూడా నేర్చుకోవాలి. ఎదుటివారిని ప్రేమించాలి.. ఇతరుల కోసం కష్టపడాలి.. దాన ధర్మాలు చేయాలి.. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి.. విహారయాత్రలు చేయాలి.. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండాలి.. ఇలా అన్ని రకాలుగా జీవితం ఉంటేనే సార్ధకం ఏర్పడుతుంది. అయితే ఇవి డబ్బులు లేని వారు కూడా చేయవచ్చు. కానీ డబ్బు ఉన్నవారు కొంత సౌకర్యంగా చేస్తారు. అందువల్ల కేవలం డబ్బు మాత్రమే జీవితం కాదని.. అన్ని రకాలుగా ఉండేదే అసలైన జీవితమని గుర్తుంచుకోవాలి