Rahul Gandhi : రాహుల్ గాంధీ నాయకత్వాన్ని జీర్ణించుకోలేని మమతా బెనర్జీ

రాహుల్ గాంధీ నాయకత్వాన్ని జీర్ణించుకోలేని మమతా బెనర్జీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : July 29, 2024 9:11 pm

Rahul Gandhi : ఇండియా కూటమి ఎన్నాళ్లు కలిసి ఉంటుంది. అసలు కలిసే ఉండే అవకాశం ఉందా? వైరుధ్యాలు బాగా కనిపిస్తున్నాయి. యూపీఏలో ఇలా పార్టీలు ఉండేవి కావు. 10 ఏళ్లు యూపీఏలు చిన్న చిన్న సంఘటనలు మినహా కలిసి ప్రయాణించారు.

ఇప్పుడున్న ‘ఇండి’ కూటమిలో పార్టీలు కలిసి ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఇండి కూటమిలో సమాజ్ వాదీ, టీఎంసీ, ఆప్, లెఫ్ట్ పార్టీలు చేరాయి. సిద్ధాంతపరమైన వైరుద్యాలు ప్రతీపార్టీలోనూ ఉన్నాయి.

కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఇందులో లేదు.ఎక్కువ ప్రాంతీయ పార్టీలు చేరడం.. సైద్ధాంతికంగా వ్యతిరేకించిన శివసేన పార్టీ ఇండి కూటమిలో ఉండడం మింగుడుపడడం లేదు.

ఇండీ కూటమి సాధ్యమవుతుందా? లేదా? అన్నది ఇక్కడ అందరినీ వేధిస్తోంది. బెంగాల్ లో కమ్యూనిస్టులు, టీఎంసీలు బద్ధ శత్రువులు. పంజాబ్ లోనూ ఆప్, కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్నాయి. మరి ఈ పార్టీలు ఎలా కలిసి జాతీయ స్థాయిలో పోరాడుతాయి.

రాహుల్ గాంధీ నాయకత్వాన్ని జీర్ణించుకోలేని మమతా బెనర్జీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.