https://oktelugu.com/

Samantha : సమంత తల్లి అయ్యిందా? అది చూపిస్తూ క్లారిటీ ఇచ్చిన స్టార్ లేడీ! అభిమానుల హార్ట్ బ్రేక్!

విడాకులు తీసుకుని సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్న సమంత గర్భం దాల్చడం ఏమిటీ? ఆమె రహస్యంగా ఎవరితోనైనా రిలేషన్ లో ఉందా? . సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ అభిమానుల మైండ్ బ్లాక్ చేసింది. వారు కంగారు పడ్డారు. అసలు ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : July 29, 2024 / 08:19 PM IST
    Follow us on

    Samantha : స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె ప్రెగ్నెన్సీ కిట్ లాంటిది చూపిస్తూ ఫోటో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. హీరోయిన్ సమంత కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎటువంటి నేపథ్యం లేకుండా సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన ఆమె సౌత్ స్టార్ లేడీగా ఎదిగింది. టీనేజ్ లోనే మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. పలు యాడ్స్ లో నటించింది.

    గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ ఏమాయ చేసావే ‘ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయిన సామ్ వరుస ఆఫర్స్ తో దూసుకుపోయింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది. సమంత 13 ఏళ్ల సినీ కెరీర్ లో హైట్స్ చూసింది. ఎన్నో అవార్డులు సాధించింది. పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.

    కానీ ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంది. మానసికంగా, ఆరోగ్యపరంగా ఎంతో వేదనకు లోనైంది. అక్కినేని నాగ చైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతకాలానికి వారి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. వారు ఎందుకు విడిపోయారు అనేది మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఈ విషయం పై నాగ చైతన్య ఇప్పటివరకు ఎక్కడా కూడా మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం సందర్భం వచ్చినప్పుడల్లా పరోక్షంగా స్పందించింది.

    కాగా కొంతకాలంగా మాయోసైటిస్ చికిత్స తీసుకుంటూ సినిమాలకు దూరంగా ఉన్న సామ్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. బాలీవుడ్ వెబ్ సిరీస్ హాని బన్నీ లో నటించింది. ఇక ఇటీవల ‘ మా ఇంటి బంగారం ‘ పేరుతో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించింది. ఇది ఇలా ఉండగా .. సామ్ తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. కారులో కూర్చుని, చేతిలో ఏదో ఓపెన్ చేస్తూ కనిపించింది. అది చూడటానికి ప్రెగ్నెన్సీ కిట్ లా కనిపించింది.

    దీంతో సమంత గర్భం దాల్చాలని చెబుతుందా అని నెటిజన్లు షాక్ అయ్యారు. కానీ తీరా చూస్తే అది ఒక చిన్న పేపర్ స్లిప్. అందులో ‘ఫైండ్ హనీ ఆన్ 01/08’ అని రాసి ఉంది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సమంత ప్రెగ్నెంట్ అయ్యిందని షాక్ అయ్యాం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సమంత చేసిన లేటెస్ట్ పోస్ట్ వైరల్ గా మారింది.

    సిటాడెల్ సిరీస్ కి హనీ బన్నీ అని టైటిల్ పెట్టారు. ఈ సిరీస్లో సమంత పాత్ర పేరు హనీ. ప్రొమోషన్స్ లో భాగంగా సమంత సోషల్ మీడియాలో సదరు ఫోటోలు పంచుకుంది. అది ఫ్యాన్స్ ని తప్పుదోవ పట్టించింది. సమంత కావాలనే ఇలా చేసిందా లేక అనుకోకుండా జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న హనీ బన్నీ త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.