Mamata Banerjee attack on BJP: బెంగాల్ ఎన్నికలకు ఆరునెలల టైం ఉంది. కానీ ఇప్పటికే బెంగాల్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. రెండు సంఘటనలు నిన్న జరిగాయి. టీచర్స్ డే సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడారు. సుప్రీంకోర్టు దాదాపు 26వేల టీచర్ల పోస్టులను రద్దు చేసింది. పార్ధా చటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉండి డబ్బులు తీసుకొని జాబులు ఇప్పించాడని సుప్రీంకోర్టు రద్దు చేసి మళ్లీ నియామకాలు పెట్టమని ఆదేశించింది. ఎవరైతే లంచాలు ఇచ్చారో ఆ అభ్యర్థుల పేర్లను బయటపెట్టారు. వారంతా టీఎంసీకి దగ్గరివారే.. అనుచరులే.. ఈ టీచర్స్ డేకు అటెండ్ అయిన మమతా బెనర్జీ.. టీచర్ల రద్దుపై సన్నాయి నొక్కులు నొక్కింది. లంచాలు తీసుకున్న వారికి టీచర్ల పోస్టులు రద్దు చేయడం తప్ప మరో ఆప్షన్ లేదని.. వారందరికీ క్లర్క్ పోస్టులను ఇస్తానంటూ మమతా చెప్పింది .దీంతో అందరూ షాక్ అవుతున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా సభలో అరుపులు, కేకలతో ఆగ్రహం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
సభా కార్యక్రమం కొనసాగుతుండగా, ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థ, మహిళల భద్రత, అవినీతి అంశాలపై వరుస ఆరోపణలు చేశారు. ఈ విమర్శలకు ప్రతిస్పందిస్తూ మమతా బెనర్జీ తీవ్ర స్వరంతో మాట్లాడారు. కొంతమంది సభ్యులు ఆమె ప్రసంగాన్ని అడ్డుకోవడంతో, మమతా బెనర్జీ కోపంతో గళం ఎత్తారు.
“ప్రజల కోసం నేను రాత్రింబవళ్లు కష్టపడుతున్నా. కానీ మీరు నన్ను అవమానించడానికి ప్రయత్నిస్తే సహించను” అంటూ మమతా బెనర్జీ గట్టిగా హెచ్చరించారు. ఈ సమయంలో ఆమె స్వరాన్ని పెంచి పలుమార్లు ప్రతిపక్ష సభ్యులను సవాలు చేశారు.
మమతా బెనర్జీ మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు “సీఎం సమాధానం ఇవ్వాలి” అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యం అసెంబ్లీలో గందరగోళానికి దారితీసింది. చివరికి స్పీకర్ జోక్యం చేసుకుని సభను కాసేపు వాయిదా వేశారు.
