Mahatma Gandhi Facts : మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని నిజమైన ప్రజా పార్టీగా మలిచిన వ్యక్తి. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ ఒక వర్గీయ వేదిక నుంచి బయటపడి రైతులు, కూలీలు, విద్యార్థులు, సామాన్య ప్రజలతో కూడిన మహా ఉద్యమంగా మారింది. అయినప్పటికీ, ఎంతటి మహనీయులైనా వారికి కొన్ని బలహీనతలు ఉంటాయి. గాంధీకి ఆ బలహీనత జవహర్‌లాల్ నెహ్రూ.
గాంధీ బలహీనత – నెహ్రూ
గాంధీ – నెహ్రూ సంబంధం క్లిష్టమైనది. గౌరవం, మమకారం ఒకవైపు ఉంటే, గాంధీ చేసిన ప్రోత్సాహం మరోవైపు కాంగ్రెస్ లో ఇతర శక్తివంతమైన నేతలు, ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి నాయకుల ఎదుగుదలను అడ్డుకుంది.
కీలక మలుపు: 1929 కాంగ్రెస్ అధ్యక్ష పదవి
1929లో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని నెహ్రూకు అప్పగించడం గాంధీ చేసిన అత్యంత కీలక నిర్ణయం. ఆ సమయంలో కాంగ్రెస్ లోని ఎక్కువ మంది సర్దార్ పటేల్‌ను సహజమైన అధ్యక్ష అభ్యర్థిగా భావించారు. ఎందుకంటే బర్డోలీ సత్యాగ్రహాన్ని విజయవంతంగా నడిపి, పటేల్ దేశవ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించుకున్నారు.
జవహర్‌లాల్ తండ్రి మోతీలాల్ నెహ్రూ సైతం ఒక లేఖలో పటేల్ అర్హతను గాంధీకి గుర్తుచేశారు. అయినప్పటికీ గాంధీ భవిష్యత్ నాయకుడిగా జవహర్‌లాల్ నెహ్రూనే కావాలనుకున్నారు.
పటేల్ త్యాగం
గాంధీ అభ్యర్థనపై పటేల్ వెనక్కి తగ్గి అధ్యక్ష పదవిని నెహ్రూకి వదిలిపెట్టారు. ఇది నెహ్రూ రాజకీయ జీవితంలో మలుపు కావడంతోపాటు ఆయనకు జాతీయ నాయకత్వం దిశలో పునాది వేసింది.
బోస్ విభేదాలు – నెహ్రూ బలోపేతం
తరువాత కాలంలో సుభాష్ చంద్రబోస్ – గాంధీ మధ్య తాత్విక విభేదాలు తీవ్రం కావడంతో, నేతాజీ కాంగ్రెస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామం నెహ్రూ ఎదుగుదలకు మరింత బలాన్నిచ్చింది.
గాంధీ ఎంపిక – వారసత్వ ప్రభావం
సర్దార్ పటేల్ లేదా సుభాష్ బోస్‌లాంటి నాయకులను పక్కనపెట్టి నెహ్రూకు చేసిన గాంధీ ప్రోత్సాహం కేవలం ఆ సమయంలోని తాత్విక పోకడలకే పరిమితం కాలేదు. అదే నిర్ణయం తరువాత కాంగ్రెస్ లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ “నెహ్రూ యుగం”కు దారి తీసింది. ఈ నిర్ణయమే నెహ్రూ కుటుంబ పాలనకు బీజం వేసిందని విమర్శకులు పేర్కొంటారు.
కాంగ్రెస్ లో నెహ్రూ పెరుగుదల నేతాజీ బహిష్కరణ గాంధీ పుణ్యమే.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
