Natural Star Nani completes 17 years: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇండస్ట్రీ లో ఎలాంటి సపోర్టు లేకుండా వచ్చి తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న నటుడు నాని ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఇకమీదట చేయబోతున్న సినిమాలు అతనికి మరొక మంచి గుర్తింపును సంపాదించి పెట్టబోతున్నట్టుగా తెలుస్తున్నాయి… 2008 వ సంవత్సరంలో ‘ అష్ట చమ్మా’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన ఒక్కో మెట్టు పైకెక్కుతూ స్టార్ హీరో ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలు పూర్తయింది అంటూ ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఇక తన ప్రయాణం ఇప్పుడే మొదలైంది అంటూ అందులో రాసుకు రావడం విశేషం… ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తన ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఇక మీదట ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా తన అభిమానులు కాలర్ ఎగిరేసే విధంగా ఉండాలి గాని, వాళ్ళను డిసపాయింట్ అయ్యేవిధంగా ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో ఆయనే ఆచితూచి మరి సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు…
మొదట్లో క్లాసు సినిమాలను చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు మాస్ జపం చేస్తున్నాడు. అందులో భాగంగానే మాస్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ‘దసర’ సినిమాతో ఒక్కసారిగా మాస్ ఇమేజ్ ని సంపాదించి పెట్టిన ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాలన్నీ మాస్ ఇమేజ్ ను సంపాదించి పెట్టడమే కాకుండా మాస్ లో టాప్ ప్లేస్ కి వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
ఇక తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఎదిగి టైర్ వన్ హీరోలకు పోటీని ఇచ్చే స్థాయిలో నిలుస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇలా ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చాయి.
కానీ పారడైజ్ సినిమాలో బోల్డ్ డైలాగ్స్ ఐతే ఉన్నాయి. మరి ఆ డైలాగుల వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ అతను నుంచి దూరం అయిపోయే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి… కానీ నాని మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా తన సినిమాలో కంటెంట్ ఉంటుందని కేవలం డైలాగులు మాత్రమే బోల్డ్ గా ఉన్నాయని తెలియజేయడం విశేషం… చూడాలి మరి ఆయన టైర్ వన్ హీరోగా మారతాడా? లేదా అనేది…