Kerala : కుంభకోణాలు, కుటుంబాలు, సామాజిక అంశాలు తెరపైకి

కేరళలో కుంభకోణాలు, కుటుంబాలు, సామాజిక అంశాలు తెరపైకి వస్తున్న వివాదంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : April 11, 2024 4:03 pm

Kerala : కేరళలో ఎన్నికలకు ఇంకా రెండు వారాలున్నాయి.. అయినా ఇప్పటికే కేరళలో వేడి రాజుకుంది .. నిన్నటికి నిన్న కేరళ స్టోరీ వివాదం తిరిగి వివాదంగా మారింది. ఈసారి వివాదం ఏ హిందూ సంస్థనో కాదు చేసింది. క్రిస్టియన్ సంస్థ చేసింది. కేరళ క్యాథలిక్ యూత్ మూమెంట్ అని చేపట్టారు. యూత్ ఆర్గనైజేషన్ పనిగట్టుకొని కేరళ స్టోరీ సినిమాను ప్రదర్శిస్తున్నారు.

దీనిపై సీఎం విజయన్ సీరియస్ అవుతున్నారు. ఎందుకు కావాలని ప్రదర్శిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రదర్శించేది క్రిస్టియన్లు కావడంతో విజయన్ కక్కలేకమింగలేకపోతున్నారు. హిందువులు అయితే అణగదొక్కేవారు. ఇప్పుడు విజయన్ కు కౌంటర్ గా క్రిస్టియన్లు అందరూ మండిపడుతున్నారు.

క్రైస్తవులు వర్సెస్ కమ్యూనిస్టులుగా వివాదం మారింది. రెండోది ఇది పెద్ద ఇష్యూ కాబోతోంది.. ఎన్నికలకు ముందే కాకుండా తర్వాత కూడా పెద్ద వివాదం కాబోతోంది. ఇది వరకూ ఓ బ్యాంకును సీపీఎం నేతలు ఎలా వాడుకున్నారో వివాదమైంది. ఇప్పుడు కేరళ స్టోరీ విజయన్ , సీపీఎం నేతలకు శరాఘాతంగా మారింది.

కేరళలో కుంభకోణాలు, కుటుంబాలు, సామాజిక అంశాలు తెరపైకి వస్తున్న వివాదంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.