CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దిగ్గజ సోషల్ మీడియా సంస్థ ఎక్స్(ట్విట్టర్) షాక్ ఇచ్చింది. ఆయన ఖాతాలోని బ్లూ టిక్ మాయం కావడం సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్లు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ ఎలాన్‌మస్క్ చేతికి వచ్చాక అనేక మార్పులు జరిగాయి. చివరకు పేరు కూడా ఎక్స్‌గా మార్చేశారు. పిట్టను తొలగించారు. X సింబల్‌ను అందులో చేర్చారు. ఇక బ్లూ టిక్ ఒకప్పుడు వెరిఫైడ్ అకౌంట్స్‌కు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. దీంతో ఎవరిది ఫేక్ అకౌంట్, ఎవరిది రియల్ అకౌంటో తెలియని పరిస్థితి నెలకొంది.
అసలు ఏం జరిగిందంటే..
సీఎం రేవంత్‌రెడ్డి తన ట్విట్టర్(ఎక్స్) ఖాతా బ్లూ టిక్ మార్కు కోల్పోయారు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ ఎక్స్ ఖాతాను ఎవరైనా హ్యాక్ చేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు, ఫాలోవర్లు అయితే హ్యాకింగ్ వలన ఇలా జరగదని, టెక్నికల్ సమస్య అయి ఉంటుందని పేర్కొంటున్నారు.
ప్రొఫైల్ పిక్చర్ మారడంతో..
సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ ఖాతా ప్రొఫైల్ పిక్చర్ మార్చడంతో ఈ సాంకేతిక సమస్య ఏర్పడిందని బ్లూ టిక్ మాయమైందని సీఎం సోషల్ మీడియా అకౌంట్లు చూస్తున్న టీం తెలిపింది. రెండు రోజుల్లో బ్లూ టిక్ మార్కు తిరిగి వస్తుందని పేర్కొంది. ప్రజలు గందరగోళానికి గురికాకుండా ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌పై ట్యాగ్ చేయడం, మెసేజ్ చేయడం కొనసాగించవచ్చని వెల్లడించింది.
ప్రొఫైల్ పిక్‌గా రాహుల్‌గాంధీ..
ఇక రేవంత్‌రెడ్డి తన ఎక్స్ ఖాతా ప్రొఫైల్ పిక్‌గా ఇంతకాలం అతని ఫొటో ఉండేది. ఇప్పుడు దానిని తొలగించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి టార్చ్ పట్టుకుని నడుస్తున్న ఫొటోను పెట్టుకున్నారు. ఈ కారణంగానే బ్లూ టిక్ సమస్య తలెత్తిందని అంటున్నారు.