Pakistan: పోలీస్ స్టేషన్లపై దాడి చేస్తూ పాకిస్తాన్ సైన్యం దారుణాలివీ..!

పాకిస్తాన్‌లోని జర్నలిస్టు రౌఫ్‌ లాస్రా ఎక్స్‌(ట్విట్టర్‌)లో సైన్యం దాడికి సంబంధించిన వివరాలను పోస్టు చేశాడు. పంజాబ్‌ రాష్ట్రంలోని భావల్‌నగర్‌లో మదరసా పోలీస్‌ స్టేషన్, ఆర్మీ సిబ్బంది మధ్య ఘర్షణ వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు.

Written By: Raj Shekar, Updated On : April 11, 2024 3:41 pm

Pakistan

Follow us on

Pakistan: దేశ ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పాకిస్తాన్‌ సైన్యం ఇప్పుడు ప్రజలపైనే అకృత్యాలకు పాల్పడుతోంది. ఈసారి పాక్‌ ఆర్మీ క్రూరత్వానికి ఆ దేశ పోలీసులే. పాకిస్తాన్‌ సైన్యం ఓ పోలీస్‌ స్టేషన్‌పై దాడిచేసి పోలీసులను కొట్టింది. రక్తస్రావం అయ్యేలా గాయపర్చింది. ఓ జవాను సోదరుడి నుంచి అక్రమ ఆయుధాలను రికవరీ చేయడమే పోలీసులు చేసిన తప్పిదం.

పంజాబ్‌ పొలీస్‌ స్టేషన్‌పై దాడి..
పాకిస్తాన్‌లోని జర్నలిస్టు రౌఫ్‌ లాస్రా ఎక్స్‌(ట్విట్టర్‌)లో సైన్యం దాడికి సంబంధించిన వివరాలను పోస్టు చేశాడు. పంజాబ్‌ రాష్ట్రంలోని భావల్‌నగర్‌లో మదరసా పోలీస్‌ స్టేషన్, ఆర్మీ సిబ్బంది మధ్య ఘర్షణ వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. పెట్రోలింగ్‌ సమయంలో ఆర్మీ కమాండో సోదరుడి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకోవడంతో వివాదం తలెత్తిందని తెలిపాడు. సైనికుల ఆగ్రహాన్ని పోలీసులు ఎదుర్కొనాల్సి వచ్చిందని వెల్లడించాడు. పోలీసులను తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపాడు. స్టేషన్‌ ఇన్‌చార్జి, సిబ్బంది శరీరాలపై గుర్తులు పడే విధంగా కొట్టారని పేర్కొన్నాడు.

పోలీస్‌ చీఫ్‌పై ప్రశ్నలు..
సోషల్‌ మీడియాలో, పంజాబ్‌ పోలీస్‌ చీఫ్‌ కెప్టెన్‌ ఉస్మాన్‌కి తన సైనికులను రక్షించడానికి వస్తారా అని ఓ ప్రశ్న అడిగారు. అంతే కాదు ఈ విషయాన్ని రిపోర్టు చేయకుండా స్థానిక మీడియాపై నిషేధం విధించారు. పరిస్థితి ఇలా దారుణంగా మారింది. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని పాకిస్తాన్‌ నిజమైన బాస్, ఆర్మీ హైకమాండ్‌కు విజ్ఞప్తి చేశారు. పాక్‌ ఆర్మీ క్రూరత్వానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈద్‌ ప్రార్థనల తర్వాత బుధవారం ఉదయం 10 గంటల సమయంలో పోలీస్‌ స్టేషన్‌పై దాడి జరిగిందని, ఇందులో పోలీస్‌ అధికారులు, వారి సహచరులు తీవ్రంగా గాయపడ్డారని వివరించాడు.