Bhimreddy Narasimha Reddy : తెలంగాణ తొలి దశ పోరాటం గురించి ఈనాటి నవతరానికి తెలిసింది చాలా తక్కువ. నిజాం నవాబు పాలనలో దేశ్ ముఖ్ లు, జాగీర్దాలు చేసిన దారుణాలు ఎన్నో.. ప్రజలు ఏ స్థాయిలో ఉన్నారంటే ‘నీ బాంచెన్ కాలు మొక్కుతా దొర’ అని బతిమిలాడేవారు. కానీ ఈ మార్పు రావడానికి కృషి చేసిన మహనీయులు ఎవరు?
నిజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా మొగ్గ తొడిగింది ‘ఆంధ్ర మహాసభ’. భాషోద్యమం నుంచి మొదలై భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం మలుపు తిరిగింది. అందులో పాల్గొన్న ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకుందాం..
ఆయనే తెలంగాణ చేగువేరా.. బీమిరెడ్డి నరసింహారెడ్డి. ఈయన్ను బీఎన్ రెడ్డి అంటారు. పుట్టింది భూస్వామ్య కుటుంబంలో.. కమ్యూనిస్టు సిద్ధాంత ప్రభావంతో రైతులు, రైతు కులీలకోసం సబ్బండ వర్గాల కోసం బతికిన ఆదర్శమూర్తి. నిజాం నవాబు సేనలకు వ్యతిరేకంగా సాయుధపోరాటాన్ని ముందుండి నడిపిన నాయకుడు ‘బీఎన్ రెడ్డి. బీఎన్ రెడ్డి దళం అంటే నిజాంకు, రజాకర్లు, జాగీర్దార్లకు వణుకు. అన్ని వదులుకొని ప్రజల కోసం పోరాడిన వ్యక్తి బీఎన్ రెడ్డి.
ఎస్సారెస్పీ కాలువకు బీఎన్ పేరు పెట్టి గుండెల్లో పెట్టుకుందాం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
