Motorola C96 5G: ఇటీవల Motorola మొబైల్స్ కు డిమాండ్ పెరిగిపోతుంది. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్స్ తో పాటు కెమెరా, వీడియో పనితీరు బాగుండడంతో చాలా మంది ఈ కంపెనీకి చెందిన మొబైల్స్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వినియోగదారులకు అనుగుణంగా కంపెనీ సైతం ఆకట్టుకునే మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన Motorola C96 5G మొబైల్ ఆకట్టుకుంటోంది. ఓఐఎస్ కెమెరాతో పాటు భారీగా బ్యాటరీ సామర్థ్యం ఉండడంతో ఆన్ లైన్ లో ట్రెండీ సేల్ అవుతోంది. మరి ఇందులో అంతగా ఆకట్టుకునే ఫీచర్స్ ఏం ఉన్నాయో చూద్దాం..
Motorola C96 5G కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీని ప్రధాన కెమెరా OIS తో కూడిన 50 మెగా పిక్సెతో పనిచేస్తుంది. అలాగే 8 MP అల్ట్రావైడ్ మాక్రో రియర్ ఉంది. దీంతో ఫొటో షూట్ చేసుకోవాలని అనుకునేవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా నైట్ మోడ్ కూడా ఆకర్షణీయమైన ఫొటోలు అందిస్తుంది. అలాగే ఇందులో 5500 mAh బ్యాటరీని అమర్చారు. ఇది 33 వాట్ టర్బో పవర్ తో పనిచేస్తుంది. తక్కువ సమయంలోనే 80 శాతం రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఆడియో స్పీకర్లు డాల్పీ రేంజ్ లో టాయి. వీటికి అట్మాస్ సపోర్ట్ చేయడంతో 3.5 ఎంఎం హెడ్ ఫోన్ అనుగుణంగా ఉంటుంది. గేమింగ్ కోసం అల్ట్రావైడ్ కెమెరా చాలా వరకు ఉపయోగపడుతుంది.
ఈ మొబైల్ లో 7S Gen 2 8జీబీ ramను అమర్చారు. అలాగే స్టోరీ కోసం 128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజ్ కు అవకావం ఇచ్చారు. ఇది మైక్రో SD ద్వారా 1 టీబీ వరకు విస్తరించుకోవచ్చు. డిస్ప్లే విషయానికొస్తే 6.67 అంగుళాల FHD+Poled 144Hz రిఫ్రెస్ రేట్ తో ఉండడంతో హెచ్ డీ వీడియోస్, మూవీస్ అద్భుతం అనిపిస్తాయి. ఏఐ వీడియోలు ఇందులో వీక్షించడం ద్వారా కొత్త అనుభూతినిస్తుంది. అలాగే 3డీ కర్వ్ డిజైన్ ఉండడంతో పాటు కలరింగ్ ఇంప్రెస్ చేస్తుంది.
ఆన్ లైన్ లో దీని ప్రైస్ రూ.18,999తో విక్రయిస్తున్నారు. బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరింత తక్కువగా లభ్యమయ్యే అవకాశం ఉంది. మోటరోలా కంపెనీకి చెందిన మొబైల్స్ బ్యాటరీ బ్యాకప్ కు ప్రసిద్ధి. ఈ కొత్త మైబల్ లో 5500 mAh బ్యాటరీ సామర్థ్యం ఉండడంతో ఛార్జీంగ్ సమస్యలు ఉండే అవకాశం ఉండదు. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేసేవారికి ఇది సౌకర్యంగా ఉంటుంది.