Ladakh statehood protest: లఢక్ లో అల్లర్లు చెలరేగాయి. నలుగురి చనిపోయారు. 20 మందికి పైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. అసలేంటి లఢక్ సమస్య. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ ను విడదీసి.. జమ్మూ కశ్మీర్, లఢక్ రెండింటిని సపరేట్ చేశారు. జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. లఢక్ లో అలాంటి రాష్ట్ర హోదా ఇవ్వలేదు. హామీ ఇవ్వలేదు.
లఢక్ లోని లఢక్ లో బుద్దిస్టులు, కార్గిల్ లో షియా ముస్లింలు ఎక్కువగా ఉంటారు. ఇరాన్ ప్రభావం కార్గిల్ లో ఉంటుంది. లఢక్ లేహ్ వాసులు ఎప్పటి నుంచి జమ్మూకశ్మీర్ లో ఉంచొద్దు అని డిమాండ్ చేస్తున్నారు. కార్గిల్ వాసులు మాత్రం తమను జమ్మూ కశ్మీర్ లోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం సమస్య ఏంటంటే.. జాతీయ భద్రతా దళాలు, ఇంటెలిజెన్స్, దేశ రక్షణ దృష్ట్యా కూలంకషంగా చర్చించి ఇది అత్యంత సున్నితమైన సరిహద్దు ప్రాంతమని.. ఇది టిబెట్ ను ఆనుకొని ఉన్నది కాబట్టి కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటేనే మంచిదని అలా చేశారు.
అయితే సమస్య ఏంటంటే.. కార్గిల్ లోని ముస్లింలు, లఢక్ లోని బుద్దిస్టులు కలిసి తాజాగా ఆందోళనలు చేపట్టారు. మాకు రాష్ట్ర హోదా కావాలని.. రెండు ఎంపీ సీట్లు ఇవ్వాలని.. రిజర్వేషన్లు పెంచాలని.. కోరికల చిట్టాను బయటపెట్టారు.
అత్యంత సున్నిత ప్రాంతం లడఖ్ లో అల్లర్లు రెచ్చగొట్టిందెవరు? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.