Shreyas Iyer: “బంగారపు హుండీని చిల్లర వేయడానికి వాడుతున్నారు.. ” కేజీఎఫ్ సినిమాలో ఈ డైలాగ్ గుర్తుంది కదా.. ఇది టీం ఇండియాలో శ్రేయస్ అయ్యర్ కు నూటికి నూరు శాతం సరిపోతుంది. అద్భుతమైన టాలెంట్.. అనితర సాధ్యమైన అటాకింగ్ ప్లేయింగ్.. అయ్యర్ సొంతం. కాకపోతే జట్టులో ఉన్న రాజకీయాల వల్ల.. గౌతమ్ గంభీర్ పోకడల వల్ల అయ్యర్ కు జట్టులో స్థానం స్థిరంగా ఉండలేకపోతోంది. ఇది సహజంగానే అతడి అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.
ఐపీఎల్ లో 2024 సీజన్లో కోల్ కతా జట్టును అయ్యర్ విజేతగా నిలిపాడు. గంభీర్ ప్రచారం వల్ల అతడికి ఆ క్రెడిట్ దక్కలేదు. 2025 సీజన్ లో పంజాబ్ జట్టుకు అతడు సారధిగా నియమితుడయ్యాడు. ఆ జట్టును ఏకంగా ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఇంత చేసినప్పటికీ.. అతడికి మేనేజ్మెంట్ జట్టులో స్థిరంగా స్థానం కల్పించలేకపోయింది. రకరకాల కథనాలు మీడియాలో ప్రసారం కావడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం ఇచ్చింది. ఆ ట్రోఫీలో వచ్చిన అవకాశాన్ని అయ్యర్ వినియోగించుకున్నాడు. జట్టు సాధించిన విజయాలలో ముఖ్య పాత్ర పోషించాడు. కీలకమైన ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టాడు. అటువంటి అయ్యర్ కు అంతకు ముందు జరిగిన టి20 వరల్డ్ కప్ లో అవకాశం లభించలేదు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో చోటు లభించలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లోనూ అవకాశం దక్కలేదు.
ఇలా వరుస సిరీస్ లలో అతనికి అవకాశం లభించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అయ్యాయి. విలేకర్ల సమావేశంలో బీసీసీఐ పెద్దలను పాత్రికేయులు నేరుగానే ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో బీసీసీఐ పెద్దలు విఫలమయ్యారు.. జట్టులో ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారని.. అందువల్లే అవకాశం కల్పించలేకపోతున్నామని చెప్పారు గానీ.. అసలు విషయం అది కాదు. ఇక ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరుగుతున్న అనధికారి క టెస్టు సిరీస్లో టీమిండియా కు అయ్యర్ ను సారధిగా నియమిస్తూ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. అయితే తొలి టెస్టులో అయ్యర్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. డిటో అతనిపై మేనేజ్మెంట్ ఒత్తిడి తీసుకొచ్చినట్టు ప్రచారం జరిగింది. దీంతో అతడు టెస్ట్ సిరీస్ మధ్యలో నుంచి వెళ్లిపోయాడు. ఒక రకంగా తన నిరసనను మేనేజ్మెంట్ మీద వ్యక్తం చేశాడు. దీంతో మేనేజ్మెంట్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో.. తప్పు ఒప్పుకొని తలవంచింది. గంభీర్ సైతం అయ్యర్ కు సపోర్ట్ గా నిలిచినట్టు తెలుస్తోంది. అందువల్లే ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగే 3 వన్డే ల సిరీస్ కు సారధిగా అయ్యర్ ను నియమించింది. తొలి వన్డేకు ఒక జట్టును.. మిగతా రెండు వన్డేలకు మరొక జట్టును ప్రకటించింది. సెప్టెంబర్ 30, మూడు, ,ఐదు తేదీలలో ఈ మ్యాచ్లు జరుగుతాయి.. తొలి వన్డే అయ్యర్ నాయకత్వంలో జరుగుతుంది. ఐపీఎల్ లో పంజాబ్ జట్టు తరఫున మెరుపులు మెరిపించిన ప్రమాదకరమైన ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్, రియాన్ పరాగ్, ఆయుష్ బదోని, సూర్యాంష్ షెడ్గే, విప్రజ్, నిశాంత్, గుర్జ ప్నీత్ సింగ్, యుద్వీర్, ఆర్ బిష్ణోయ్, పోరెల్, ప్రియాంష్, సిమర్జీత్.