Rahul Gandhi vs Election Officer: బెంగళూరు రాజకీయ వాతావరణం నిన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో కాసేపు ఉత్కంఠభరితంగా మారింది. ఉదయం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి “6 వేల ఓట్లు తొలగించబడ్డాయి” అంటూ పెద్ద ఆరోపణ చేశారు. ఈ వ్యాఖ్య ఒక్కసారిగా మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే సాయంత్రానికి ఆయన ఎక్స్ అకౌంట్‌లో “ఓట్లు తొలగిస్తే ఏమవుతుంది?” అంటూ మరో పోస్ట్ పెట్టడం గందరగోళానికి దారితీసింది.
రాహుల్ గాంధీ ఇలా రెండు విధాలుగా మాట్లాడడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కొంతమంది ఆయన మాటలను “హైడ్రోజన్ బాంబ్ పేల్చినట్టే” అని వ్యాఖ్యానిస్తే, మరికొందరు “ఇవి పెల్లుబికిన వెంటనే మాయమైపోతున్న బాంబుల్లాంటివి” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఈ వివాదానికి తెరదించినది కర్ణాటక ఎన్నికల అధికారే. ఆయన స్పష్టంగా స్పందిస్తూ “ఓటర్ జాబితాలో మార్పులు చేయడానికి, తొలగింపులు చేయడానికి కఠినమైన ప్రొసీజర్ ఉంటుంది. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే విచారణ చేసి మాత్రమే చర్యలు తీసుకుంటాం. ఈసీ వద్ద అన్ని రికార్డులు అందుబాటులో ఉన్నాయి. అక్రమంగా ఓట్లు తొలగించడం జరగదు” అని క్లారిటీ ఇచ్చారు.
దీంతో రాహుల్ గాంధీ ఆరోపణలు క్షణాల్లో పటాపంచలు అయ్యాయి.
ప్రస్తుతం ఆయన చేసిన ట్విస్టులు కాంగ్రెస్ శ్రేణులను ఇబ్బందుల్లోకి నెట్టగా, బీజేపీ మాత్రం అదే అవకాశంగా తీసుకుని “రాహుల్ మళ్లీ మాటలతో పేల్చిన బాంబు ఫెయిల్ అయ్యింది” అంటూ విమర్శలు గుప్పిస్తోంది.
మొత్తానికి, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు, ఆయన తానే పెట్టిన కౌంటర్ వ్యాఖ్యలు, ఎన్నికల అధికారుల స్పష్టత.. అన్నీ కలిపి నిన్నటి రోజున కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి.
కర్ణాటక ఎన్నికల అధికారి జవాబుతో రాహుల్ గాంధీ ఆరోపణలు పటా పంచలు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.