Jagan Supporting Rowdy Sheeters : తెనాలికి జగన్ పరామర్శ యాత్ర. ఇదేం పెద్ద విశేషం కాదనుకుంటే పొరపాటే. ఎవరి కోసం ఈ పరామర్శ అన్నది ఇక్కడ కీలకంగా మారింది. వైఎస్ఆర్ మరణించిన వారికి పరామర్శలో కొంత అర్థం ఉంది. ఈరోజు తెనాలికి ఎందుకోసం వెళుతున్నారంటే.. ఒక ముగ్గురు పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్న వారిని పరామర్శించేందకు వెళుతున్నారు.
వాళ్లు రాజకీయ నాయకులు కాదు.. సామాజిక కార్యకర్తలు కారు.. ఎవరు వీరు అని చూస్తే.. తెనాలిలో ముగ్గురిని పట్టుకొని పబ్లిక్ గా పోలీసులు వారిని కొట్టారు. అనుకోకుండా వారు ముగ్గురు దళితులు. దీని మీద ఇప్పుడు మానవహక్కులు గుర్తుకొచ్చాయి.
జగన్ పాలనలో అమలాపురంలో దళిత డ్రైవర్ ను డోర్ డెలివరీ చేశారు. సొంత బాబాయి హత్య చేశారు. మానవహక్కులు పోయాయని జగన్ పరామర్శ కు వెళ్లారు.
ఎందుకు పోలీసులు కొట్టారు. జగన్ పరామర్శకు అర్థముందా? ఈ ముగ్గురు ఎవరు? వారిని పరామర్శించడం సబబా? రౌడీ షీటర్లు హత్య నిందితుల పరామర్శ కోసం తెనాలికి జగన్ తీరపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.