YS Jagan : జగన్ మోహన్ రెడ్డి ఓ వింతైన క్యారెక్టర్. ఆయన గురించి చాలా మాట్లాడుకోవడం విన్నాం. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాడు. నిన్న జరిగిన సంఘటన చూస్తే జగన్ పై అసహ్యం వేస్తోంది. మొన్నటిదాకా షర్మిల – జగన్ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ముఖం చాటేసుకున్నారు. ఇటీవలి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి షర్మిల కూడా తన వంతుగా ఒక చేయి వేశారు. ఫలితంగా ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిన జగన్మోహన్ రెడ్డి.. ఐదు సంవత్సరాలకే పరిమితమైపోయారు. 151 సీట్లు గెలుచుకున్న రికార్డ్ సృష్టించిన ఆయన.. కేవలం 11 సీట్ల వద్ద మాత్రమే ఆగిపోయారు.
ఆస్తుల కోసం జగన్మోహన్ రెడ్డిని బెదిరించడానికే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారని విమర్శలున్నాయి. ఆ తర్వాత ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నప్పుడు షర్మిల ఎందుకోసం పార్టీ పెట్టారో? ప్రజలు ఎలా పట్టించుకుంటారని భావించారో? షర్మిలకే తెలియాలి. పైగా పార్టీ ఏర్పాటు వల్ల ఆమె భారీగా ఖర్చుపెట్టారు. పైగా తన పార్టీని ప్రమోట్ చేసుకోవడం కోసం ఆంధ్రజ్యోతికి జాకెట్ యాడ్స్ ఇచ్చారు. వేమూరి రాధాకృష్ణకు ఓపెన్ హార్ట్ ఆర్కే ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆంధ్రజ్యోతి పత్రికకు ఎడిటోరియల్ వ్యాసాలు కూడా రాశారు. సాక్షిలో ఎలాగూ తనకు స్పేస్ ఇవ్వరు.. ఈనాడులో పెద్దగా పట్టించుకోరు కాబట్టి.. నాడు షర్మిల ఆంధ్రజ్యోతికి దగ్గరయ్యారు.. రాధాకృష్ణకు మరో చెల్లెలయ్యారు.
ఇటీవల జగన్మోహన్ రెడ్డి షర్మిల తో రాజీకి వచ్చారని.. ఆస్తులకు సంబంధించి ఒప్పందాలు కూడా పూర్తి చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అవన్నీ పూర్తి అబద్దాలని.. ఊహ జనితాలని తేలిపోయింది. అయితే షర్మిలకు, జగన్మోహన్ రెడ్డికి మధ్య ఆస్తుల వివాదం సమసి పోలేదని.. ఆయన ఏకంగా తన సోదరి షర్మిల, మాతృమూర్తి విజయమ్మపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కేసు దాఖలు చేశారని తెలుస్తోంది. అయితే ఈ పిటిషన్ ను ఆయన గత నెలలోనే వేశారని.. వచ్చే నెలలో అది విచారణకు వస్తుందని తెలుస్తోంది.
అన్న ప్రవర్తన తీరుతో విసిగి వేసారి పోయిన షర్మిల ఒక లేఖ రాసింది. అందులో తల్లి విజయమ్మ ప్రస్తావన కూడా ఉంది. అయితే దీనిని అత్యంత తెలివిగా టిడిపి బయట పెట్టింది. “సొంత తల్లి, చెల్లిపై కేసులు పెట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఎంఓయూ ప్రకారం సొంత చెల్లికి దక్కాల్సిన ఆస్తులను కూడా మీరు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. మన తండ్రి అడుగుజాడల్లో నడవాల్సిన మీరు ఇలా దారి తప్పడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని” షర్మిల జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొనగా.. ఈ లేఖను అత్యంత తెలివిగా టిడిపి సంపాదించింది. దానిని ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..”సొంత చెల్లి మీద, తల్లి మీద కేసులు పెట్టాలని నిర్ణయించుకున్న నువ్వు.. చివరికి వారికి దక్కాల్సిన ఆస్తులను కూడా లాక్కోవడానికి సిద్ధమయ్యావా జగన్మోహన్ రెడ్డి” అంటూ ప్రశ్నించింది.
అమ్మ పైనే కేసు వేసిన జగన్ మాజీ ముఖ్యమంత్రంటే సిగ్గేస్తుంది.. జగన్ షర్మిల వివాదంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు