Israel-Iran conflict : ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. యుద్ధం ఇప్పటిదాకా పరోక్షంగా జరగగా.. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రారంభమైంది. ఇజ్రాయెల్ ను లేకుండా చేయాలని అరబ్, ఇస్లాం దేశాలు ప్రయత్నించాయి. అరబ్ దేశాలు బాగా ప్రయత్నించినా విఫలమయ్యాయి. ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గలేదు.
ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ ను లేకుండా చేయాలని కంకణం కట్టుకొని పనిచేసింది. ఇందుకోసం ఉగ్రవాద సంస్థలను ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాల్లో సృష్టించి యుద్ధాన్ని కొనసాగించింది. హమాస్, యెజుబుల్లా, హుతీలతో ఇజ్రాయెల్ పై దాడులకు తెగబడింది. ఇది చాలా ఏళ్లుగా జరిగింది.
ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధానికి కారణం ఏంటంటే.. ఇరాన్ అణ్వాయుధాలు తయారికి రెడీ అయ్యింది. ఆ స్టేజీకి ఇరాన్ కూడా అణుబాంబు తయారీకి రెడీ అయ్యింది.
తాజాగా ఐరాస అనుబంధమైన ఐఏఈఏ కూడా ఇరాన్ అణుకార్యక్రమాలను ధృవీకరించింది. ఇరాన్ అణుబాంబుల తయారీ ఆపాలని సూచించింది. ఇరాన్ అణు నిబంధనలు ఉల్లంఘిస్తోందని తీర్మాణం చేసింది.
దీనికి ఇరాన్ మేం సీక్రెట్ గా అణ్వాయుధాలను తయారు చేస్తున్నామని ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్ కు మంచి సందర్భం దొరికింది. అణ్వాయుధాల వంకతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడికి దిగింది.
ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం ప్రాంతీయ యుద్ధమా ప్రపంచ యుద్ధమా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.