Arvind Kejriwal : సుప్రీంకోర్టు నిన్న చాలా వినూత్నమైన తీర్పునిచ్చింది. స్వాతంత్ర భారత చరిత్రలో ఇటువంటి తీర్పు చూడలేదు. ఇంటరీమ్ బెయిల్ కు కేసుకు సంబంధం లేదు. కేసులో మెరిట్స్, డీమెరిట్స్ తో సంబంధం లేకుండా ‘ఇంటరీమ్’ బెయిల్ ఇస్తారు. వాళ్ల కుటుంబంలో ఏదైనా జరిగి ప్రత్యక్షంగా అటెండ్ కావడానికి ఇస్తారు. ఆరోగ్యం బాగా క్షీణించినప్పుడు.. ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు అటెండ్ కావడానికి ఇస్తారు.
ఇలా ‘ఇంటరీమ్’ బెయిల్ వచ్చిన దాఖలాలు ఎవరికీ లేవు. తాజాగా సుప్రీంకోర్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ప్రచారం చేసుకోవడానికి అందరికీ సమాన అవకాశాలు ఉండాలని బెయిల్ మంజూరు చేసిందట.. ఇలాంటిది ఎక్కడైనా విన్నామా చరిత్రలో.. అలాంటిది బెయిల్ కోసం ఇప్పుడు అందరూ నాయకులు ప్రచారం చేస్తామని సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
ఎన్నికైన ప్రజాప్రతినిధికి ఒక చట్టం.. సామాన్యుడికి మరో చట్టమా? అని అందరూ అడుగుతున్నారు.. అనాధిగా భారత్ పాటించిన న్యాయసూత్రాలకు ఇది విఘాతంగా చెప్పొచ్చు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనన్న నీతి ఇక్కడ గాడితప్పింది.
చట్టం ముందు అందరూ సమానులు కాదు, కొందరికి మినహాయింపు’ అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.