https://oktelugu.com/

Train Mystery  : మిస్టరీ: సొరంగంలోకి వెళ్లిన రైలు అదృశ్యం? రైళ్లోని వంద మంది ఏమయ్యారు?

ఓ రైలు సొరంగం నుంచి ప్రయాణించింది. ఇలా ప్రయాణం చేసిన ఆ రైలు సొరంగం నుంచి ఇప్పటివరకు బయటకు రాలేదు. అందులో ఉన్న 104 మంది ప్రయాణికుల ఏం అయ్యారు? వారికి ఏం జరిగింది వంటి ప్రశ్నలక సమాధానం తెలియడం లేదు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 22, 2024 / 11:19 PM IST

    Train Mystery 

    Follow us on

    Train Mystery :   ఈ ప్రపంచంలో జరిగే చాలా సంఘటనలకు గల కారణాలు తెలియడం లేదు. ఎన్నో ప్రశ్నలకు సమాధానం మిస్టరీగానే మిగిలిపోయింది. అలాంటి వాటిలో ఒకదానిపై శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. అయినా సరే ఫలితం మాత్రం అంతుచిక్కడం లేదు. అచ్చం ఇలాంటి సంఘటన ఒకటి వంద సంవత్సరాల క్రితం జరిగింది. ఓ రైలు సొరంగం నుంచి ప్రయాణించింది. ఇలా ప్రయాణం చేసిన ఆ రైలు సొరంగం నుంచి ఇప్పటివరకు బయటకు రాలేదు. అందులో ఉన్న 104 మంది ప్రయాణికుల ఏం అయ్యారు? వారికి ఏం జరిగింది వంటి ప్రశ్నలక సమాధానం తెలియడం లేదు. ఈ సంఘటన కేవలం రైల్వేలకే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది.

    1911 సంవత్సరంలో ఇటలీకి చెందిన ఓ జెనెట్టి రైల్వే కంపెనీ కొత్త రైలును ప్రారంభించింది. దాని కోచ్‌ల నుంచి ఇంజిన్ వరకు అన్నీ కొత్త పరికరాలతో తయారు చేశారు. అయితే టెస్టింగ్‌లో భాగంగా ప్రయాణికులకు మొదటిసారి ఉచిత టికెట్‌ ఆఫర్ ను ప్రకటించింది కంపెనీ. ఫ్రీ టికెట్‌, ఫ్రీ ఫుడ్‌ ఆఫర్‌ వల్ల రైలులో ప్రయాణించేందుకు పెద్ద ఎత్తున స్థానికులు ఆ ట్రైన్ ఎక్కి వెళ్లారు. మొత్తం ఆరుగురు సిబ్బంది, 100 మంది ప్రయాణికులు ఆ రైలు ఎక్కారు. అయితే ఈ జర్నీలో రైలు ఒక సొరంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత రైలు వెంటనే అదృశ్యమైపోయింది. సొరంగం తర్వాత స్టేషన్‌కి రాలేదు. అలా సొరంగంలోకి వెళ్లిన ట్రైన్ ఏమైందో ఇప్పటికీ తెలియడం లేదు.

    మిలియా-రొమాగ్నా, లోంబార్డి మధ్య 1 కి.మీ పొడవు ఉన్న సొరంగంలోకి వెళ్లింది ఈ రైలు. అప్పట్లో అతి పొడవైన సొరంగంగా ఇది నిలిచింది. టన్నెల్‌లోకి వెళ్లిన రైలు బయటికి రాలేదు కాబట్టి ఎన్నో పుకార్లు వచ్చాయి. రైలు మరో లోకం చేరింది అంటూ కొందరు భావిస్తే.. దీంట్లోని కొన్ని భాగాలు రష్యా, ఉక్రెయిన్, జర్మనీలలో కనిపించాయని కొందరు అన్నారు. మరి కొంతమంది మాత్రం రైలు మెక్సికో చేరిందని అంటున్నారు. ఏదేమైనా సరే తప్పిపోయిన రైలు గురించి ఇప్పటికీ కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. టన్నెల్‌లోకి ప్రవేశించిన తర్వాత రైలు ఏమైంది? ఎక్కడికి వెళ్లింది? అందులోని ప్రయాణీకులు ఏమయ్యారు? అనే ప్రశ్నలు ఎప్పుడు వీడుతాయో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

    ఇదిలా ఉంటే ఈ రైలు టైమ్ మెషిన్‌గా మారిందని కొందరూ అంటూ 71 ఏళ్లు వెనక్కి వెల్లిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సొరంగంలో అదృశ్యమైన రైలు 1940లో మెక్సికోకు చేరుకుందని నివేదికలు తెలుపుతున్నాయి. ఒక మెక్సికన్ వైద్యుడు తన ఆసుపత్రిలో 104 మందిని రహస్యంగా చేర్చారని కూడా టాక్. కానీ వారందరికీ పిచ్చి పట్టిందని అంటున్నాయి కొన్ని నివేదికలు. అయితే ఇందులో నుంచి ఇద్దరు మాత్రమే ప్రాణాలతో భయటపడ్డారట. ట్రైన్ టన్నెల్ లోపలికి ప్రవేశించే ముందు ఓ ఇద్దరు బయటకు దూకారట. రైలు సొరంగంలోకి ప్రవేశించిన వెంటనే తెల్లటి పొగ రైలులో నిండిపోయింది అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని పేర్కొన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు.