India vs Pakistan : ఆపరేషన్ సింధూర్.. ఇది భారత్ సాక్ష్యాలతో సహా చేసి నిరూపించింది. అద్భుతమైన, సమర్థవంతమైన దాడి ఇదీ. ఉగ్రవాద శిబిరాలను తుదముట్టించింది. మరి దీనికి పాకిస్తాన్ ప్రతీకార దాడి చేస్తుందా? లేదా? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్..
పాక్ దేశ ప్రజల్లో ఇప్పుడు ఇదే డిమాండ్ నెలకొంది. దాడికి సర్వసన్నద్ధంగా ఉన్నా కూడా 9 చోట్ల భారత్ 21 స్ట్రైక్స్ ఎలా చేయగలిగిందని వారంతా అక్కడి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అంటే పాక్ ఆర్మీ దద్దమ్మలు అని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రజలను కన్విన్స్ చేసేందుకు ఆర్మీపై వ్యతిరేకత అసంతృప్తి తగ్గించేందుకు ప్రతీకార దాడి పాక్ చేస్తుందన్నది అందరూ చెప్పుకుంటున్న మాట..
ఫుల్ స్కేల్ వార్ కు పాక్ రెడీ అవుతుందా? ఎలా ముందుకెళుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారత ఆర్మీ కేవలం ఉగ్రవాద శిబిరాలనే టార్గెట్ చేసింది. మరీ పాక్ ఎక్కడ దాడి చేస్తుంది.? మిలటరీపై దాడి చేయవచ్చు. పాక్ యుద్ధం మొదలుపెడితే.. పాక్ పై ఫుల్ గా పాక్ పై దాడి చేయడం ఖాయం.
పాకిస్తాన్ అంతరంగంగా చూసుకుంటే.. ఆర్మీ వెంట పాక్ ప్రజలు 100 శాతం నడిచే పరిస్థితి లేదు. అత్యంత బలహీన పరిస్థితుల్లో పాక్ ఆర్మీ ఇప్పుడు ఉంది. నిజంగా పాక్ ప్రతీకార దాడులకు దిగితే.. పాక్ ముక్కలవ్వటం ఖాయం. ఇది భారత్ కు అందివచ్చిన అవకాశంగా చెప్పొచ్చు.
పాకిస్తాన్ ప్రతీకార దాడులకి పాల్పడితే జరిగేదేంటి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.