Revanth Reddy : రేవంత్ రెడ్డి 9 నెలల పాలన ఎలా ఉంది? ప్లస్ మైనస్ లు ఏంటి? ఓవరాల్ గా జనం ఏమనుకుంటున్నారు. తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి పాలనపై సుముఖంగా ఉన్నారా. ? కేసీఆర్ తో పోలిస్తే రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది?
9 నెలలు మరీ ఎక్కువ కాదు.. మరీ తక్కువ కాదు.. రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఫాస్ట్ గా ఉంటాయి.. వినూత్నంగా ఉంటాయి.. రెండు లక్షల వరకూ రుణమాఫీ చాలా ఫాస్ట్ గా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతమందికి ఇంత ఫాస్ట్ గా ఒకే దఫాలో క్లియర్ చేసి మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు.
నిన్నటికి నిన్న స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. సూపర్ 6 అమలులో జాప్యం జరిగినా స్కిల్ వర్సిటీ ని ఏర్పాటు చేయించి దానికి చైర్మన్ గా ‘ఆనంద్ మహీంద్రా’ను పెట్టడం పారిశ్రామికవేత్తలను ఇన్ వాల్వ్ చేయడం వినూత్నమైన ఐడియా.. ప్రయారిటీ దానికి ఇవ్వడం బాగా నచ్చింది.. ఈ విషయంలో రేవంత్ రెడ్డిని అభినందించక తప్పదు.
హైడ్రా విషయంలో అమలులో లోపాలు, సమస్యలు ఉండొచ్చు.. కానీ ఇంటెంట్ బాగుంది.. ఆక్రమణలను అరికట్టాలనే భావన చాలా బాగుంది.
రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ పాలనకు భిన్నంగా వుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.