Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలు అంతా ఇంతా కాదు. ఆయన వరుస సినిమాలను చేసి సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా తనకున్న ఇమేజ్ ని అంతకంతకు పెంచుకుంటూ వచ్చాడు. ఇక ఆయన ఇన్ని సంవత్సరాల కెరియర్లో చేయని పాత్ర లేదు, వెయ్యని వేషం లేదు. ఆయన తన నటనకు క్లాప్స్ కొట్టని ప్రేక్షకులు లేరు… ఆయన అందుకొని అవార్డులు లేవు, సాధించని విజయాలు లేవు… అలాంటి చిరంజీవి కెరియర్ లో కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలను కూడా చేశాడు. అందులో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని మాత్రం ఫెయిల్యూర్ గా మిగిలాయి. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ‘చంటబ్బాయి’ సినిమా అప్పటికి చిరంజీవిలో ఉన్న ఒక కొత్త ఫ్లేవర్ ను బయటకు తీసింది. కానీ మాస్ సినిమాలను చేస్తూ స్టార్ హీరోగా ఎదిగిన చిరంజీవి అలాంటి సినిమా చేయడం అప్పటి ప్రేక్షకులకు నచ్చలేదు. కాబట్టి ఆ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ ఇప్పటికీ కూడా ఆ సినిమా చాలా ఫ్రెష్ ఫీల్ ఇస్తుందనే చెప్పాలి…
జంధ్యాల గారి మార్క్ డైలాగులు, చిరంజీవి యాక్టింగ్ ఎపిసోడ్, ప్రతిదీ ప్రేక్షకులందరిని మెప్పించడంలో చాలావరకు సక్సెస్ అయింది. కానీ అప్పటి ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా అంతగా కనెక్ట్ అవ్వకపోవడానికి కారణం చిరంజీవి మాస్ ఇమేజ్ అనే చెప్పాలి. కానీ ఆ సినిమాని ఇప్పుడు చూసిన కూడా చూసిన ప్రతిసారి మనకు ఏదో ఒక కొత్త విషయం అనేది తెలుస్తూ ఉంటుంది.
ఇక ఈ సినిమా అప్పుడెప్పుడో వచ్చిన సినిమాల కాకుండా రీసెంట్ గా తీసిన సినిమాలానే అనిపిస్తూ ఉండడం విశేషం…ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్ అయితే వేరే లెవల్లో ఉంటుంది. ఇప్పటివరకు ఏ హీరో కూడా అలాంటి ఓ కామెడీ మ్యానరిజంతో సినిమాను చేయలేదని చెప్పవచ్చు. ఇక చిరంజీవి ఇలాంటి పాత్రలో చేయడం లో ఎప్పుడు ముందు వరుస లో ఉంటాడు. అందుకే చిరంజీవిని మించిన నటుడు మరొకరు లేరు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమా విషయంలో మాత్రం చిరంజీవి చాలా వరకు కష్టపడ్డాడని అప్పట్లో జంధ్యాల ఒకానొక సందర్భంలో తెలియజేశాడు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వకపోయిన కూడా ఇప్పుడు సినిమాలు చేసే చాలామంది యంగ్ డైరెక్టర్స్ కి ఈ సినిమా ఒక పుస్తకంల యూజ్ అవుతుందనే చెప్పాలి. ఇందులో ఉన్న ప్రతి సీన్ లో చిరంజీవి చేసిన యాక్టింగ్, జంధ్యాల రాసిన డైలాగు ప్రేక్షకుడిని ఎక్కడో అక్కడ హుక్ చేస్తుంది… ఇప్పుడున్న దర్శకులు ఈ సినిమాని ఒక్కొక్కరు ఒక 20 సార్లు చూసేస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…