Bangladeshi Hindus : బంగ్లాదేశ్ లో జరుగుతున్నది మారణహోమానికి దారితీస్తుందో ఏమోనన్న భయాలు ఏర్పడుతున్నాయి. నిన్నా మొన్న జరిగిన సంఘటనలు చాలా చాలా కలవరపరుస్తున్నాయి. షేక్ హసీనాను పదవీచిత్యురాలిని చేసి ఆవిడను దేశం నుంచి పంపించిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా భారత్ లో ఉన్న ప్రతీ ఒక్కరిని కలవరపరుస్తున్నాయి.
షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన వెంటనే.. ఏ అధికారంతో మహ్మద్ యూనస్ ఏ అధికారంతో అధికారంలో కూర్చున్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రధాన సలహాదారు పోస్ట్ ఉందా? కేర్ టేకర్ గవర్నమెంట్ అన్నది ఎక్కడైనా ఉందా? షేక్ హసీనా సరిగ్గా ఎన్నికలు నిర్వహించలేదని ఆరోపిస్తున్న అతివాదులకు అసలు ఎన్నికలు లేకుండానే నియమించుకున్న యూనస్ వ్యవహారశైలి మరీ దారుణంగా ఉంది.
ఇప్పుడు యూనస్ రాడికల్ ఎలిమెంట్స్ ఉన్న తీవ్రవాదులు జైలు నుంచి బయటకు వచ్చారు. హిందువుల మీద దాడులు చేస్తున్నారు. ఆస్తులపై దాడులు, దేవాలయాలపై దాడులు చేస్తున్నారు.
బంగ్లాదేశ్ హిందువులను ఆదుకోవటమెలా? అన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.