Game Changer Pre-Release : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మేకర్స్ ఇప్పటి వరకు రెండు పాటలు, ఒక టీజర్ ని విడుదల చేయగా, వాటికి అభిమానులు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రేపు ఈ చిత్రం నుండి ‘నానా హైరానా’ అనే మెలోడీ సాంగ్ విడుదల కాబోతుంది. నిన్న ఈ మెలోడీ సాంగ్ కి సంబంధించిన చిన్న బిట్ ని జత చేస్తూ, BTS వీడియో ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిన్న బిట్ సాంగ్ కి మ్యూజిక్ లవర్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలకంటే, ఈ పాట ఇంకా అద్భుతంగా ఉండేట్టు ఉందని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేసారు.
రేపు పూర్తి స్థాయి లిరికల్ వీడియో విడుదలైన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ పాటని విదేశాల్లోని అద్భుతమైన లొకేషన్స్ లో ఇన్ఫ్రారెడ్ కెమెరా ద్వారా చిత్రీకరించారు. ఇప్పటి వరకు ఈ కెమెరా తో ఇండియాలో ఎలాంటి సినిమా కానీ, సాంగ్ కానీ చిత్రీకరించలేదు. మొట్టమొదటిసారి ఆ ప్రయోగం ‘గేమ్ చేంజర్’ చిత్రానికి చేశారు. సుమారుగా 20 కోట్ల రూపాయలకు పైగా ఈ సాంగ్ చిత్రీకరణ కోసం ఖర్చు చేశారట. ఇదంతా పక్కన పెడితే వచ్చే నెల మొదటి వారం నుండే ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రొమోషన్స్ భారీ లెవెల్ లో చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారట మేకర్స్. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఓవర్సీస్ ఇలా అన్ని ప్రాంతాల్లో వేరే లెవెల్ ప్రొమోషన్స్ ని చేయబోతున్నారట. ఇప్పటికే అమెరికాలో డిసెంబర్ 22వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయట.
జనవరి 4వ తేదీన రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథిగా పిలవబోతున్నారట. ఈ ఈవెంట్ ని మెగా అభిమానులు జీవితాంతం గుర్తించుకునేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కలిసి ఒకే సినీ వేదిక పై కనిపించిన చివరి ఈవెంట్ ‘సై రా నరసింహా రెడ్డి’. ఆ తర్వాత వీళ్లిద్దరు కుటుంబ పరమైన మీటింగ్స్ లో మాత్రమే పాల్గొన్నట్టు మనం చూసాము కానీ సినిమాలకు సంబంధించిన మీటింగ్స్ లో మాత్రం చూడలేదు. అసలే ఇప్పుడు మెగా అభిమానులు మంచి యూనిటీ తో ఎమోషనల్ గా ఉన్నారు. ఈ ఎమోషనల్ బాండింగ్ ని పదింతలు రెట్టింపు చేస్తూ బాబాయ్, అబ్బాయి ప్రసంగాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తి కరంగా మారింది.