https://oktelugu.com/

Samantha : శ్రీదేవి కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టనున్న సమంత..? బాలీవుడ్ ని ఊపేస్తున్న లేటెస్ట్ న్యూస్!

సమంత గురించి లేటెస్ట్ గా బాలీవుడ్ లో వినిపిస్తున్న ఒక వార్త 'వైల్డ్ ఫైర్' లాగా వ్యాప్తి చెందింది. వివరాల్లోకి వెళ్తే ఈమె అతి లోక సుందరి శ్రీదేవి భర్త బోణీ కపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ తో గత కొంతకాలం నుండి డేటింగ్ చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Written By:
  • Vicky
  • , Updated On : November 27, 2024 / 08:00 PM IST

    Samantha

    Follow us on

    Samantha :  సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే హీరోయిన్స్ లో ఒకరు సమంత. ఇంస్టాగ్రామ్ లో ఈమె ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను అప్లోడ్ చేస్తూ తన అభిమానులతో నిత్యం అందుబాటులో ఉంటుంది. అప్పుడప్పుడు ఈమె కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఈమె టాలీవుడ్ లో కంటే ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు, వెబ్ సిరీస్ లో చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా చేసిన ఈమె, ఈ వెబ్ సిరీస్ ప్రొమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూస్ లో తన మాజీ భర్త నాగ చైతన్య గురించి ఈమె చేసిన పరోక్షమైన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. విడాకులు జరిగి మూడేళ్లు అవుతుంది, ఎవరి జీవితాలను వాళ్ళు చూసుకున్నారు, ఇలాంటి సమయంలో పాత విషయాలను తవ్వడం ఎందుకు అని సమంత ని నెటిజెన్స్ తిడుతున్నారు.

    ఇదంతా పక్కన పెడితే సమంత గురించి లేటెస్ట్ గా బాలీవుడ్ లో వినిపిస్తున్న ఒక వార్త ‘వైల్డ్ ఫైర్’ లాగా వ్యాప్తి చెందింది. వివరాల్లోకి వెళ్తే ఈమె అతి లోక సుందరి శ్రీదేవి భర్త బోణీ కపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ తో గత కొంతకాలం నుండి డేటింగ్ చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కనీసం ఒక యాడ్ అయినా, వెబ్ సిరీస్ అయినా చేయలేదు. అయినప్పటికీ కూడా వీళ్ళ మధ్య రూమర్స్ పుట్టడానికి ప్రధాన కారణం, రీసెంట్ గా సమంత తన ఇంస్టాగ్రామ్ లో బాధపడుతూ పెట్టిన ఒక పోస్టు కి అర్జున్ కపూర్ ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వడమే. ‘ఎంతో అద్భుతంగా మాట్లాడావు..నువ్వు చెప్పిన ఈ పదాలను నేను నా ఇంటి గోడ మీద ఫ్రేమ్ చేయించి పెట్టుకుంటాను. జీవితం లో ఏదైనా కష్టసమయం వచ్చినప్పుడు ఈ మాటలు నాకు చాలా ఆదర్శంగా నిలుస్తాయి’ అని చెప్పుకొచ్చాడు.

    ఇక్కడ అర్జున్ కపూర్ కేవలం ఒక తోటి నెటిజెన్ గా మాత్రమే ఆమె పెట్టిన ఎమోషనల్ పోస్ట్ కి కనెక్ట్ అయ్యి రియాక్ట్ అయ్యాడు. అంత మాత్రానికే బాలీవుడ్ మీడియా ఆమెకి, అర్జున్ కపూర్ కి లింక్ పెడుతూ కథనాలు ప్రచురిస్తున్నారు. బాలీవుడ్ మీడియా అనేది ఒక గాసిప్ మీడియా అని అందరూ అనేది ఇందుకే. అయితే సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ వార్తపై అర్జున్ కపూర్, సమంతలు స్పందిస్తారా లేదా అనేది చూడాలి. ఇలాంటి విషయాలను వెంటనే రెస్పాన్స్ ఇస్తేనే భవిష్యత్తులో పెద్దవి అవ్వకుండా కంట్రోల్ గా ఉంటాయి. అలా కాకుండా సోషల్ మీడియా లో ఇలాంటివి వందల వార్తలు వస్తుంటాయి, పట్టించుకోకూడదు అనుకుంటే భవిష్యత్తులో పెద్దవి గా మారి కెరీర్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.