Himanta Biswa Sarma : హిమంత బిస్వా శర్మ ఈ ఎన్నికల్లో పట్టు బిగించేనా?

హిమంత బిస్వా శర్మ ఈ ఎన్నికల్లో పట్టు బిగించేనా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియో లో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : April 19, 2024 6:52 pm

Himanta Biswa Sarma : అస్సాం.. 14 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. ఈశాన్య భారతం మొత్తానికి కూడా ఆయువుపట్టులాంటి ప్రాంతం ఇదీ .. త్రిపుర, మణిపూర్ తప్పితే ఇప్పుడున్న ఈశాన్య రాష్ట్రాలన్నీ అస్సాంలోనే ఉండేవి. అస్సాం ప్రత్యేకత ఏంటంటే.. దాదాపు వేయి సంవత్సరాల క్రితం ముస్లిం దండయాత్ర ఈ ప్రాంతంపై జరిగింది. బెంగాల్ దాటి.. ఈశాన్య భారతంలోకి ఎంట్రీ కాకుండా అడ్డుకున్న ఏకైక రాజ్యం అస్సాం కావడం విశేషం. ఇక్కడి పౌరుషాన్ని మరిచిపోవద్దు. అహోమ్ డైనస్టీ కింగ్ డామ్ కు చాలా పేరుంది. ప్రస్తుతం జోర్హాట్ లోక్ సభ నియోజకవర్గంలో ఉంది.

అస్సాం ప్రత్యేకంగా మనం మాట్లాడుకోము.. భారత్ లో పెద్ద యుద్ధం నడిపిన ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఎందుకు నాశనం అవుతున్నాయి. బెంగాల్, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలస దారులు వచ్చి అసోంను ఆక్రమించారు. అధికారికంగా 37 శాతం వలసల వారే ఉన్నారు. అసోం అంటే తేయాకు కార్మికులు, ఆదివాసీలు, బోడోలు, రకరకాల వారు ఇక్కడ ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారు బెంగాలీ భాషను రుద్దుతూ అసోం సంస్కృతిని రుద్దుతున్నారు.

1985లో ఒప్పందం జరిగింది. ఈరోజు ఎన్నికకు ముందు కీలక పరిణామం జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన కాశ్మీర్ తోపాటు అసోంలో జరిగింది. అస్సామీ సంస్కృతి కాపాడుకోవాలంటే అక్రమ వలసలదారులను అరికట్టాలి. అస్సాం భాషను కాపాడుకోవాలి. దీనికి పునర్విభజన ఎంతో దోహదపడింది. హిమంత భిస్వాశర్మ కీలక పాత్ర పోషించారు.

హిమంత బిస్వా శర్మ ఈ ఎన్నికల్లో పట్టు బిగించేనా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియో లో చూడొచ్చు.